Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stress: మనుషుల్లో ఒత్తిడిని శునకాలు పసిగడతాయా? తాజా అధ్యయనంలో ఆశ్చర్యకర విషయాలు..

యూకేలోని బెల్‌ ఫాస్ట్‌ నగరం నుంచి 'ట్రియో, ఫింగల్, సూట్, విన్నీ' అనే నాలుగు కుక్కలతో సహా మొత్తం36 మంది మనుషులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

Stress: మనుషుల్లో ఒత్తిడిని శునకాలు పసిగడతాయా? తాజా అధ్యయనంలో ఆశ్చర్యకర విషయాలు..
Stress
Follow us
Basha Shek

|

Updated on: Oct 01, 2022 | 2:02 PM

మనం ఒత్తిడి, టెన్షన్‌లో ఉన్నామన్న సంగతి మనకు కూడా కొన్నిసార్లు తెలియదు. కానీ, కుక్కలు మన చెమట వాసన, శ్వాస నుంచి ఒత్తిడిని పసిగడతాయని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.కుక్కలు అత్యంత సున్నితమైన, సహజ జ్ఞానం కలిగిన జంతువులని మరోసారి నిరూపితమైంది. యూకేలోని బెల్‌ ఫాస్ట్‌ నగరం నుంచి ‘ట్రియో, ఫింగల్, సూట్, విన్నీ’ అనే నాలుగు కుక్కలతో సహా మొత్తం36 మంది మనుషులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు ఒక కష్టమైన గణిత సమస్యను ఇవ్వడానికి ముందు, ఆతర్వాత పార్టిసిపెంట్స్‌ నుంచి చెమట, శ్వాస నమూనాలను సేకరించారు. అలాగే ఈ సమస్యను సాల్వ్‌ చేసే ముందు, తర్వాత సదరు వ్యక్తుల రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరిగిన నమూనాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ప్రతి పరీక్షా సెషన్‌లో ఒక్కో కుక్కకు ఒక వ్యక్తికి సంబంధించి నాలుగు నిమిషాల వ్యవధిలో తీసుకున్న రిలాక్స్‌డ్, ఒత్తిడితో కూడిన నమూనాలు ఇవ్వబడ్డాయి. ఈ సమయంలో కుక్కలన్నీ ప్రతి వ్యక్తి స్ట్రెస్ శాంపిల్‌కు సరిగ్గా హెచ్చరించగలిగాయని పరిశోధకులు తెలిపారు. ‘మానవులు ఒత్తిడికి లోనైనప్పుడు చెమట, శ్వాస ద్వారా భిన్నమైన వాసనలు వస్తాయని పరిశోధనలు ఇప్పటికే తేల్చాయి. రిలాక్స్‌గా ఉన్నప్పుడు మన వాసన వేరుగా ఉంటుందని కుక్కలు పసిగడతాయి. కానీ, కొన్నిసార్లు మనకు కూడా తెలియదు’ అని బెల్‌ఫాస్ట్‌లోని క్వీన్‌ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి క్లారా విల్సన్‌ తెలిపారు. కుక్కలకు తెలియని వ్యక్తి అయినా సరే ఈ వాసనలను గుర్తించగలవని పరిశోధకులు చెబుతున్నారు. కాగా సర్వీస్ డాగ్స్, థెరపీ డాగ్స్ శిక్షణలో ఈ ఫలితాలు సాయపడతాయని రీసెర్చర్స్‌ పేర్కొన్నారు. అంతేకాదు మనిషితో కుక్కల సంబంధాన్ని మరింత వెలుగులోకి తెచ్చేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
ఈ చిన్న అలవాట్లతో మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
ఈ చిన్న అలవాట్లతో మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
మరో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
మరో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..