Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bone Health: ఎముకలు బలహీనంగా ఉన్నాయా..?.. తక్షణమే ఈ ఐదు ఆహారాలను తినడం మానేయండి

పోషకాల లోపం.. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ఎముకలు బలహీనంగా మారడంతోపాటు నిత్యం నొప్పి వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి, ఎముకలకు హాని చేసే ఆహారాలను మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Bone Health: ఎముకలు బలహీనంగా ఉన్నాయా..?.. తక్షణమే ఈ ఐదు ఆహారాలను తినడం మానేయండి
Bone Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 01, 2022 | 2:06 PM

ప్రస్తుత కాలంలో పోషకాల లోపం వల్ల చాలామంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల ఆరోగ్యం చాలామందిలో మెరుగుపడదు. ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే బోన్ డాక్టర్‌ని కలవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముందుగా ఆహార శైలిని మార్చుకుంటే ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. వాస్తవానికి అనారోగ్యకరమైన ఆహారం, పానీయాలు అనేక సమస్యలకు కారణమవుతాయి. దీని కారణంగా శరీరం తక్కువ ప్రయోజనం పొందుతుంది.. ఇంకా ఎక్కువ హాని కలుగుతుంది. పోషకాల లోపం.. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ఎముకలు బలహీనంగా మారడంతోపాటు నిత్యం నొప్పి వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి, ఎముకలకు హాని చేసే ఆహారాలు ఏమిటి..? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు – చక్కెర ఎక్కువగా తినకండి..

చక్కెర, ఉప్పు మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇవి లేకుండా ఆహారంలో మంచి రుచిని ఆశించలేము. కానీ ఉప్పు – పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపిస్తుంది. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారడం మొదలవుతుంది. వీటితో మీ శరీరం అన్ని రకాలుగా బాధను అనుభవిస్తూనే ఉంటుంది. అందువలన ఖచ్చితంగా ఉప్పు, చక్కెరను పరిమితికి మంచి అస్సలు తినకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాఫీ తాగడం తగ్గించండి..

నిద్రను దూరం చేసేందుకు, ఇంకా కాస్త రిలాక్స్ కోసం చాలా మంది టీ, కాఫీలు తాగుతారు. కానీ ఈ రెండింటిలో ఉన్న కెఫీన్ అనే మూలకం మన శరీరానికి హాని కలిగిస్తుంది. టీ, కాఫీలు ఎంత ఎక్కువగా తాగితే.. అందులో ఉండే కెఫిన్ మన శరీరంలో ఉండే కాల్షియంను అంత మేర తగ్గిస్తూనే ఉంటుంది. దీని వల్ల ఎముకల్లో నొప్పి వస్తుంది. అదేవిధంగా బీడీ-సిగరెట్లు, గుట్కా నమలడం కూడా మానుకోవాలి. పొగాకులో ఉండే నికోటిన్ కూడా కాల్షియం లోపానికి కారణం.

శీతల పానీయాల వల్ల కాల్షియం లోపం..

చాలా మంది శీతల పానీయాలు లేకుండా పార్టీలు చేసుకోవడానికి, చేయడానికి ఇష్టపడరు. వాస్తవానికి శీతల పానీయాలలో సోడా, హానికరమైన రసాయనాలు కలుపుతారు. దీని వల్ల ఎముకలు చాలా దెబ్బతింటాయి. రోజురోజుకు బలహీనపడటం ప్రారంభమవుతుంది. అంతే కాదు మాంసాహారం తినేవారిలో యానిమల్ ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో క్యాల్షియం లోపిస్తుంది. దీని వల్ల శరీరంలో నొప్పి మొదలవుతుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Astrology: కర్కాటక రాశిలోకి కుజుడు.. ఆ రాశుల వారు కాస్త జాగ్రత్త
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్...
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? పాస్‌పోర్ట్‌ రకాలు
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
మెరిసే స్కిన్, సిల్కీ జుట్టు కోసం కలబందను ఇలా వాడి చూడండి..
వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఆ సూపర్ హిట్ ఎలా మిస్సైందంటే..
వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాయ్.. ఆ సూపర్ హిట్ ఎలా మిస్సైందంటే..
తిరుమలలో అనుమానాస్పదంగా సంచరించిన ముస్లిం వ్యక్తి..
తిరుమలలో అనుమానాస్పదంగా సంచరించిన ముస్లిం వ్యక్తి..
ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఎవరీ అధికారి?
ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఎవరీ అధికారి?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట