AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 2 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు.. 12 రాశుల వారికి ఇలా..

Horoscope Today: జూన్ 2, 2026 మంగళవారం రాశిఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి శుభవార్తలు అందే అవకాశం ఉండగా, వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి వారు బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

జూన్ 2 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు.. 12 రాశుల వారికి ఇలా..
Rashifal In Telugu 02 June 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 02, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (జూన్ 2, 2026): మేష రాశి వారికి ఈ రోజంతా చాలావరకు ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ఊహించని శుభవార్త వింటారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొద్దిగా రుణాలు తీర్చుకోగలుగుతారు. మిథున రాశికి చెందిన ఉద్యోగులు సకాలంలో బాధ్యతల్ని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా చాలావరకు ఉత్సాహంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో ఊహించని శుభవార్త వింటారు. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. తొందరపాటు వ్యవహారాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొద్దిగా రుణాలు తీర్చుకోగలుగుతారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యక్తిగత పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగులు సకాలంలో బాధ్యతల్ని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగుతాయి. రాబడి బాగా పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతికి అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. బంధువుల నుంచి ఆందోళనకర వార్తలు వినడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. లాభాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యం నిర్వహించడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. వాహన ప్రమాద సూచనలున్నాయి. ప్రయాణాల్లోనూ, ఆహార విహారాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. అదనపు ఆర్థిక ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగువేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై కొద్దిగా ఊరట చెందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. తోబుట్టువుల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు పూర్తిగా ఫలిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట )

ఉద్యోగంలో అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో కాలక్షేపం చేస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆదాయానికి లోటుండదు. ప్రయాణాల్లో, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో మనస్పర్థలు ఏర్పడే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ విషయాలు ఆశించిన స్థాయిలో పురోగమిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. దగ్గర బంధువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇష్టమైన బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఒక దీర్ఘకాలిక రుణ సమస్య నుంచి తేలికగా బయటపడతారు. కొన్ని బరువు, బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. బంధువుల వల్ల లబ్ధి పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా పైచేయిగా ఉంటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల లాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందివస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి లోటుండదు.

Follow Us