AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: ఇలాంటి తప్పులు చేస్తే అస్సలు బరువు తగ్గరు.. ఇంకా పెరిగి సమస్యల్లో పడతారు జాగ్రత్త..

అందంగా ఉండడం అంటే ముఖారవిందమే కాకుండా శరీరం ఫిట్నెస్‌తో ఉండటం కూడా.. అందుకే ప్రతి ఒక్కరూ తన బరువును నియంత్రించుకోవడానికి ఏవేవో చర్యలు తీసుకుంటారు.

Weight Loss: ఇలాంటి తప్పులు చేస్తే అస్సలు బరువు తగ్గరు.. ఇంకా పెరిగి సమస్యల్లో పడతారు జాగ్రత్త..
Weight Loss
Shaik Madar Saheb
|

Updated on: Sep 30, 2022 | 1:55 PM

Share

ప్రతిఒక్కరూ ఎప్పుడూ అందంగా, స్మార్ట్‌గా కనిపించాలని కోరుకుంటారు. అదే సమయంలో అందంగా ఉండడం అంటే ముఖారవిందమే కాకుండా శరీరం ఫిట్నెస్‌తో ఉండటం కూడా.. అందుకే ప్రతి ఒక్కరూ తన బరువును నియంత్రించుకోవడానికి ఏవేవో చర్యలు తీసుకుంటారు. పెరిగిన బరువును నియంత్రించుకోవడానికి, లేదా అదే బరువును మెయింటైన్ చేయడానికి చాలామంది పలు రకాల వ్యాయామాలు చేస్తారు. అంతేకాకుండా అనేక రకాల డైట్లు కూడా అనుసరిస్తారు. ఇలాంటి సమయంలో కొన్ని తప్పులు చేయడం వల్ల శరీర బరువు తగ్గడానికి బదులు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక చాలామంది ఆందోళన చెందుతుంటారు. దీనికి ప్రధాన కారణం బరువు తగ్గే సమయంలో చేసే కొన్ని తప్పులేనని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాని వల్ల బరువు తగ్గడానికి బదులు పెరగడం మొదలవుతుందని పేర్కొంటున్నారు. కావున బరువు తగ్గే సమయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు.. బరువు పెరగడానికి కారణమేమిటీ..? అనే విషయాలను తెలుసుకుందాం..

బరువు తగ్గే సమయంలో ఈ తప్పులు చేయకండి..

తగినంత నిద్రపోకపోవడం: బరువు తగ్గించే ప్రయాణంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. మీరు రోజూ 6 నుంచి 8 గంటలు నిద్రపోకపోతే అది బరువుపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే 8 గంటలు నిద్రపోయేవారిలో జీవక్రియ చురుకుగా ఉంటుంది. అలాంటి వారి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కావున మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా 8 గంటలపాటు నిద్ర పోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం: తక్కువ తినడం వల్ల బరువు తగ్గుతుందని మీరు అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు పెరుగుతాయి. మీ బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతుంది. మరోవైపు తక్కువ ఆహారం తీసుకున్నప్పుడు.. మెదడు ఇబ్బందుల్లో ఉన్నామని గ్రహిస్తుంది. దీంతో శారీరక ప్రక్రియలు నెమ్మదిస్తాయి. దీంతో బరువు పెరగడం ప్రారంభమవుతుంది.

చాలా సేపు ఒకే చోట కూర్చొవడం: ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ శరీరం లైపేస్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా కాసేపు అటుఇటు నడవండి. ఆఫీసులో గంటల తరబడి కూర్చొకుండా.. అప్పుడప్పుడు కూర్చిలో నుంచి లేచి నడుస్తుండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!