డ్యామిట్ కథ అడ్డం తిరిగింది..! పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కింగ్ కోబ్రా.. చివరకు ఏమైందంటే..? వీడియో

ఓ నాగుపాము పోలీస్ స్టేషన్‌లో కనిపించడంతో పోలీసు అధికారులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అదెక్కడ కాటేస్తుందోనని.. అంతా ఆందోళన చెందారు.

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది..! పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కింగ్ కోబ్రా.. చివరకు ఏమైందంటే..? వీడియో
King Cobra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 30, 2022 | 1:22 PM

ఓ పోలీస్ స్టేషన్‌లో కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లోని పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఓ నాగుపాము పోలీస్ స్టేషన్‌లో కనిపించడంతో పోలీసు అధికారులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అదెక్కడ కాటేస్తుందోనని.. అంతా ఆందోళన చెందారు. స్టేషన్‌కు వచ్చిన ప్రజలు కూడా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అనంతరం స్నేక్ క్యాచర్ దానిని పట్టుకుని బంధించాడు. అయితే.. వీడియోలో స్నేక్ క్యాచర్ నాగుపామును శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది బుసలు కొట్టింది. దానిని శాంతింపజేయడానికి బదులు రెచ్చగొట్టేలా కనిపించింది. ఈ సమయంలో పలువురు పోలీసు అధికారులు కూడా సమీపంలోనే నిలబడి ఉన్నారు.

పోలీస్ స్టేషన్‌లో అకస్మాత్తుగా కింగ్ కోబ్రా కనిపించడంతో అందరూ పరుగులు తీసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం స్నేక్ క్యాచర్ దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో బంధించినట్లు వెల్లడించారు. ఈ పాము కొన్ని నిమిషాలపాటు పడగవిప్పి బుసలు కొడుతూనే ఉందని పేర్కొన్నారు. కాగా.. యమునా నది ఒడ్డున ఉండటం వల్లే ఈ కింగ్ కోబ్రా కుతౌండ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూడండి..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

నది ఒడ్డు నుంచి ప్రతిరోజూ పాములు స్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి వస్తుంటాయని పోలీస్ స్టేషన్ చీఫ్ అఖిలేష్ ద్వివేది తెలిపారు. ఇంతకు ముందు కూడా పాములు వచ్చాయని కానీ.. ఈ పాము మాత్రం మరింత భయాందోళనకు గురిచేసిందని తెలిపారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని వీక్షించి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!