సిటీ ట్రాఫిక్ తో మామూలుగా ఉండదు.. బెంజ్ కారులో వెళ్లే వారినే షేర్ ఆటో ఎక్కించేసింది
కారు.. లగ్జరీ లైఫ్ కు స్టేటస్. కారున్నోడే తోపు అని ఫీలయ్యే సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. రోడ్లపై రయ్యి రయ్యిమంటూ దూసుకెళ్తూ తోటి వాహనదారులను భయపెడుతుంటారు. కానీ బండ్లు ఓడలవడం, ఓడలు..
కారు.. లగ్జరీ లైఫ్ కు స్టేటస్. కారున్నోడే తోపు అని ఫీలయ్యే సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. రోడ్లపై రయ్యి రయ్యిమంటూ దూసుకెళ్తూ తోటి వాహనదారులను భయపెడుతుంటారు. కానీ బండ్లు ఓడలవడం, ఓడలు బండ్లవడం అనే విషయాన్ని మర్చిపోతుంటారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగే ఘటనలు ఇలాంటి విషయాలను స్పష్టం చేస్తాయి. కారున్నోడు షేర్ ఆటో ఎక్కడం, షేర్ ఆటో ఉన్నోడు కారుకు ఓనర్ అవడం మామూలే. దేనికైనా టైమ్ ఉండాలి. మనం ఎంతగా ఫోజులు కొట్టినా టైమ్ తన పని తాను చేసుకుంటుంది. మనల్ని కంట్రోల్ లో ఉంచుతూనే ఉంటుంది. అదేదో సినిమాలో ఓ హీరో.. తాను బైక్ పై వెళ్తుంటే ప్రతినాయిక కారులో వస్తుంది. అతనిని ఎగతాళి చేస్తే దీటైన సమాధానం ఇస్తాడు. కారు అసలే హెవీ వెహికిల్, సిటీ ట్రాఫిక్ రోడ్డుపై చిక్కుకుంటే.. ఇక బయట పడలేక, ముందుకు కదలేక నరకం కనిపిస్తుంది. కొంతమంది మాత్రం తాము పెద్దవాళ్లం, స్టేటస్ ఉన్న వాళ్లం అనే విషయాన్నీ మర్చిపోయి.. పని కోసం చిన్న వెహికిల్స్ నూ ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రైండింగ్ గా మారింది.
మెర్సిడెస్-బెంజ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ ష్వెంక్ ఇటీవల పుణె ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఆయన తన ఎస్-క్లాస్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. సమయం గడుస్తున్నా ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వెంటనే కారు నుంచి దిగి.. ఆటో ఎక్కి గమ్యస్థానానికి చేరుకున్నారు. ష్వెంక్ 2018 నుంచి మెర్సిడైజ్ బెంజ్ ఇండియాకు సీఈవోగా ఉన్నారు. అంతకు ముందు, అతను మెర్సిడెజ్ బెంజ్ చైనా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పని చేశారు. అయన 2006 నుంచి మెర్సిడైజ్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు.
View this post on Instagram
భారతదేశంలో లగ్జరీ కార్ల కంపెనీ తన లగ్జరీ కార్ల అమ్మకాలను పెంచడానికి కొత్త రిచ్ క్లాస్‌పై దృష్టి సారిస్తోంది. దేశంలో డాలర్ మిలియనీర్ల సంఖ్య విస్తరిస్తున్నందున అమ్మకాలలో వేగవంతమైన వృద్ధికి కారణమవుతోందని ష్వెంక్ ఏప్రిల్‌లో అన్నారు. భవిష్యత్తులో కార్ల వినియోగంలో గణనీయమైన మార్పును తీసుకురానున్నట్లు ఆయన వివరించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..