Model Dead: డిన్నర్ ఆర్డర్ ఇచ్చింది.. కానీ తలుపు తెరవలేదు.. చివరకు శవంగా కనిపించిన మోడల్..

అంథేరికి చెందిన ఓ హోట‌ల్ రూమ్‌లో 40 ఏళ్ల మోడ‌ల్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గురువారం ఎంతసేపటికీ డోర్ తీయకపోవడంతో హోటల్ యాజమాన్యం

Model Dead: డిన్నర్ ఆర్డర్ ఇచ్చింది.. కానీ తలుపు తెరవలేదు.. చివరకు శవంగా కనిపించిన మోడల్..
Model Dead
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 30, 2022 | 12:31 PM

ముంబైలో ఓ మోడల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అంథేరికి చెందిన ఓ హోట‌ల్ రూమ్‌లో 30 ఏళ్ల మోడ‌ల్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గురువారం ఎంతసేపటికీ డోర్ తీయకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. డోర్‌ను తెరిచి చూడగా శవంగా కనిపించింది. మోడల్ ను ఆకాంక్ష మోహన్‌గా గుర్తించారు. పోలీసులు ఆ రూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించగా.. సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్ ఆకాంక్ష బుధ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు హోట‌ల్‌కు చెకిన్ అయ్యింది. డిన్నర్ కూడా ఆర్డర్ చేసింది. కానీ గురువారం ఉద‌యం ఆమె డోర్‌ను తెరవలేదు. అయితే, హౌజ్‌ కీపింగ్ సిబ్బంది ఎంత పిలిచినా ఆమె డోర్ ఓపెన్ చేయ‌లేదు. దీంతో వారు హోట‌ల్ మేనేజ‌ర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే యాజమాన్యం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మాస్టర్ కీ ద్వారా ఆ రూమ్ త‌లుపును ఓపెన్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్‌కు వేలాడుతూ మోడ‌ల్ ఆకాంక్ష మోహన్ శవం కనిపించింది.

మోడల్ ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రూమ్ నుంచి ఓ సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐ యామ్ సారీ, నా చావుకు ఎవ‌రూ బాధ్యులు కారు, నేను సంతోషంగా లేను.. నాకు ప్రశాంతత కావాలి అని సూసైడ్ నోట్‌లో ఆకాంక్ష రాసినట్లు పోలీసులు తెలిపారు.

మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెర్సోవా పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పలు వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం 

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం