Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ముకేశ్ అంబానీకి భద్రత పెంచిన కేంద్రం.. Z ప్లస్ కేటగిరితో సెక్యురిటీ..

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ భద్రతను కేంద్ర హోంమంత్రిత్వశాఖ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Mukesh Ambani: ముకేశ్ అంబానీకి భద్రత పెంచిన కేంద్రం.. Z ప్లస్ కేటగిరితో సెక్యురిటీ..
Mukesh Ambani
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 30, 2022 | 7:04 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ భద్రతను కేంద్ర హోంమంత్రిత్వశాఖ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిఘా సంస్థలు ఇచ్చిన అంచనా నివేదిక మేరకు ఆయన భద్రతను ‘జడ్‌’ కేటగిరీ నుంచి జడ్‌ ప్లస్‌ కేటగిరీకి పెంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇకపై ముకేశ్‌కు 55 మంది సిబ్బందితో పటిష్ట భద్రత కల్పించనున్నారు. ఇందులో 10 మందికి పైగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు, ఇతర పోలీసు అధికారులు ఉంటారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీకి కేంద్రం జడ్‌ కేటగిరీ భద్రత కల్పిస్తోంది. అయితే గతేడాది అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో ఓ వాహనం నిలిపి ఉంచడం కలకలం సృష్టించింది. ఆ ఘటన తర్వాత అంబానీ భద్రతపై కేంద్ర హోంశాఖ విస్తృతంగా చర్చలు జరిపింది. దీంతో ఆయనకు భద్రతను పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జెడ్ ప్లస్ భద్రత అంటే రక్షణలో రెండో అత్యధిక స్థాయిని కలిగి ఉంటుంది. ముకేశ్ అంబానీ ఇక నుంచి జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ కలిగి ఉంటారు. 58 మంది కమాండోలు అంబానీకి రక్షణగా ఉంటారు. అయితే, భద్రతకు అయ్యే ఖర్చును ముకేష్ అంబానీ భరిస్తారని తెలుస్తోంది.

ముఖేష్ అంబానీకి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ ఏజన్సీలు వెల్లడించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంబానీకి తొలిసారిగా 2013లో చెల్లింపు ప్రాతిపదికన CRPF కమాండోలతో ‘Z’ కేటగిరీ భద్రతను అందించారు. అతని భార్య నీతా అంబానీ కూడా అదే విధమైన సాయుధ భద్రతను కలిగి ఉన్నారు. ఆమెకు Y+’ కేటగిరీ సెక్యురిటీ అందిస్తున్నారు. కాగా, తాజా బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. RIL చైర్మన్ అంబానీ $80.5 బిలియన్లకు పైగా నికర సంపదతో ప్రపంచంలోని 11వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..