CM KCR: నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్.. విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం బంగారం సమర్పణ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ (శుక్రవారం) యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. క్షేత్ర విమాన గోపురానికి తాపడం...

CM KCR: నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్.. విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం బంగారం సమర్పణ..
Ts Cm Kcr
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 30, 2022 | 6:34 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ (శుక్రవారం) యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సతీసమేతంగా దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. క్షేత్ర విమాన గోపురానికి తాపడం చేసేందుకు బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.30 గంటలకు యాదాద్రికి సీఎం చేరుకుంటారు. ఆలయంలోని వివిధ పనుల పురోగతి పరిశీలించనున్నారు. కాగా.. ప్రధాన ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఈ క్రమంలో దాతల నుంచి వారాళాలు సేకరిస్తున్నారు. అప్పట్లో తాను కూడా కిలో 16 తులాల బంగారాన్ని ఇస్తానని గతంలో ప్రకటించారు. మరోవైపు.. జాతీయ పార్టీ ప్రకటనపై గుట్టలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దసరా కంటే ముందే సిద్దిపేట సమీపంలోని కోనాయపల్లి వేంకటేశ్వరస్వామిని సైతం దర్శించుకుంటారు.

మరోవైపు.. అక్టోబరు 1న (శనివారం) సీఎం కేసీఆర్ హనుమకొండ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు సీఎం రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి బయలుదేరి, 11.15 నిమిషాలకు హనుమకొండకు చేరుకుంటారు. ములుగు రోడ్డులోని ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత 2 గంటలకు హైదరాబాద్‌కు పయనమవుతారు. ఆయన పర్యటన కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. దసరా రోజు జాతీయ రాజకీయ పార్టీ ప్రకటించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.

తెలంగాణలో ఎనిమిదేళ్లలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం జాతీయ స్థాయిలో రాజకీయ ప్రయోజనంగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, రైతునిరంతర విద్యుత్‌, రుణమాఫీ వంటి పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరపాలని కోరుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్ముతోందని కార్మికులు, విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో విఫలమైందని యువతను కదిలించాలని వ్యూహాలు సిద్ధం చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు తగిన అంశాలపై కేసీఆర్ బృందం అధ్యయనం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..