Telangana Rains: మరో వారం దంచికొట్టుడే.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

తెలంగాణలో కొన్ని రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రాగల వారం రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది.

Telangana Rains: మరో వారం దంచికొట్టుడే.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
Telangana Rain Alert
Follow us

|

Updated on: Sep 30, 2022 | 7:56 AM

తెలంగాణలో కొన్ని రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, రాగల వారం రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా.. శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా.. మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. అలాగే పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

నీట మునిగిన మహబూబ్‌నగర్‌..

ఇదిలాఉంటే.. మహబూబ్‌నగర్‌లో మూడు గంటలపాటు ముంచెత్తిన వానతో సిటీ సంద్రంలా మారింది. ఎడతెరిపి లేకుండా దంచికొట్టిన వర్షానికి మహబూబ్‌నగర్‌ టౌన్‌ అతలాకుతలమైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో 10 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు నీటమునిగిపోయాయి.

ఇవి కూడా చదవండి

సూర్యాపేటలో..

సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ వర్షం పడింది. ఏకధాటి వానకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..