Hyderabad: రూ.1.24 కోట్ల హవాలా డబ్బు పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు.. పక్కా సమాచారంతో..

హైదరాబాద్‌లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. భారీగా హవాలా డబ్బును తరలిస్తుండగా.. హైదరాబాద్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.

Hyderabad: రూ.1.24 కోట్ల హవాలా డబ్బు పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు.. పక్కా సమాచారంతో..
Money
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 30, 2022 | 9:58 AM

హైదరాబాద్‌లో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. భారీగా హవాలా డబ్బును తరలిస్తుండగా.. హైదరాబాద్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. నగరంలోని మాసబ్‌ ట్యాంక్‌ పరిధిలో షోయబ్‌ అనే వ్యక్తి వద్ద 1.24 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్‌లోని మీరట్‌ నగరానికి చెందిన షోయబ్‌ మాలిక్‌.. హైదరాబాద్‌ వచ్చి పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాలిక్ బంధువు కామిల్‌ సూచన మేరకు హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గుజరాత్‌ గల్లీకి చెందిన భరత్‌ వద్ద తీసుకున్న నగదును షోయబ్‌ తరలిస్తుండగా పోలీసులు దాడి చేశారు.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు షోయబ్‌ నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రూ.1.24 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నగదుకు సంబంధించిన వివరాలను చెప్పకపోవడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కాగా.. హైదరాబాద్లో భారీగా హవాలా డబ్బు పట్టుబడటం కలకలం రేపింది. కాగా.. ఈ డబ్బు వెనుక వేరే వారి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు.

హవాలా మార్గంలో డబ్బులు ఎవరికి తరలిస్తున్నారనేది టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.  స్వాధీనం చేసుకున్న రూ.1.24 కోట్లను ఆదాయపన్ను అధికారులకు పోలీసులు అప్పగించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..