MMTS: హైదరాబాద్‌లో ఎమ్‌ఎమ్‌టీఎస్‌కు తప్పిన ప్రమాదం.. భారీ శబ్దాలతో ఒక్కసారిగా ఆగిపోయిన రైలు..
హైదరాబాద్‌లో ఎమ్‌ఎమ్‌టీఎస్ రైలుకు ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో రైలు భారీ శబ్దాలతో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. రైలు మధ్యలో....
హైదరాబాద్‌లో ఎమ్‌ఎమ్‌టీఎస్ రైలుకు ప్రమాదం తప్పింది. ప్రయాణ సమయంలో రైలు భారీ శబ్దాలతో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. రైలు మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రగంలోకి దిగిన రైల్వే అధికారులు సమస్యకు కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే.. బేంగపేట్, నెక్లెస్ రోడ్ స్టేషన్ల మధ్య పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆగిపోయింది. లింగంపల్లి నుంచి వస్తున్న రైలు సాంకేతిక సమస్యలతో ఆగిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదిలా ఉంటే ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో లోకల్ ట్రైన్‌లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. రైలు ఉన్నట్లుండి ఆగిపోవడంతో ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. రైలు నుంచి దిగిపోయిన ప్రయాణికులు సమీపంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఇక రైలును వీలైంత త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..