ఇంట్లో నుంచి వస్తోన్న దుర్వాసన.. అనుమానం వచ్చి స్థానికులు వెళ్లి చూడగా..
ఓ ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన బయటకు రావడంతో స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఏం జరిగిందో.? ఏంటోనని..
ఓ ఇంట్లో నుంచి భరించలేని దుర్వాసన బయటకు రావడంతో స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఏం జరిగిందో.? ఏంటోనని పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా తలుపులు మూసి ఉన్నాయి.. వాటిని పగలుగొట్టగా.. అక్కడ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
వివరాల్లోకి వెళ్తే.. పురూలియా జిల్లాలోని శ్యామ్‌పురా గ్రామానికి చెందిన 38 ఏళ్ల సంజయ్ దాస్ ఏడు రోజుల క్రితం మృతి చెందాడు. అయితే ఈ విషయం బయటకు తెలియకుండా అతడి తల్లి తుసుదాస్.. మృతదేహాన్ని వారం రోజులుగా ఇంట్లోనే ఉంచింది. దీంతో ఒక్కసారిగా భరించలేని దుర్వాసన రావడం మొదలైంది. స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు.
వారు సంజయ్ దాస్ ఇంటికి చేరుకోగా.. తలుపులు వేసి ఉన్నాయి. వెంటనే వాటిని పగలుగొట్టారు. సంజయ్ దాస్ మృతదేహం పక్కన అపస్మారక స్థితిలో అతడి తల్లి పడి ఉండటాన్ని గమనించారు. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అంతేకాకుండా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, సంజయ్ దాస్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి