Health Benefits: దిష్టి తగలకుండా కాపాడే గుమ్మడికాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

గుమ్మడికాయతో చేసే వంటకాల రుచి గురించి ఈ తరం వారికి చాలా వరకు అవగాహన లేదు.. కానీ, గుమ్మడికాయలను కొందరు కూరగా చేసుకుని తింటారు. కొందరు వీటితో స్వీట్స్‌, వడియాలు కూడా చేసుకుంటారు.

Health Benefits: దిష్టి తగలకుండా కాపాడే గుమ్మడికాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Pumpkin Seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 01, 2022 | 3:49 PM

గుమ్మడి కాయను దిష్టి తగులకుండా ఇంటి గుమ్మం ముందు కడతారని మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. కానీ, దీనిని వండుకుని తింటారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. గుమ్మడికాయతో చేసే వంటకాల రుచి గురించి ఈ తరం వారికి చాలా వరకు అవగాహన లేదు.. కానీ, గుమ్మడికాయలను కొందరు కూరగా చేసుకుని తింటారు. కొందరు వీటితో స్వీట్స్‌, వడియాలు కూడా చేసుకుంటారు. గుమ్మడికాయ వంటకాలు నచ్చినా, నచ్చకపోయినా,..గుమ్మడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, వీటిల్లో పోషకాలు స‌మృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా నిత్యం మ‌న‌కు కావ‌ల్సిన విట‌మిన్ ఎ గుమ్మ‌డికాయ‌ల్లో 200 శాతం ఉంటుంది. అలాగే విటమిన్ సి, ఇ, రైబోఫ్లేవిన్, పొటాషియం, కాప‌ర్, మాంగ‌నీస్, విట‌మిన్ బి6, ఫోలేట్‌, ఐర‌న్, ఫాస్ఫ‌ర‌స్ వంటి పోష‌కాలు కూడా గుమ్మ‌డికాయ‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు పోష‌ణ ల‌భిస్తుంది. గుమ్మడికాయలో ఉండే విటమిన్ సి..తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. రోగనిరోధక కణాలను మరింత సమర్థవంతంగా పని చేసేలా చేస్తుంది. ఫలితంగా రకరకాల వైరస్‌లూ, ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.

గుమ్మడికాయలో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఇది కొన్ని క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. గుమ్మడికాయలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే వివిధ పోషకాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది గుండె ప్రయోజనాలతో ముడిపడి ఉంది. దీనిలో ఉండే విటమిన్ ఎ శరీరంలో బీటాకెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా కాపాడుతుంది. ఎముక సాంద్రత దృఢపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, బీటాకెరొటిన్లు అధికంగాఉంటాయి. ఇవి కంటిచూపు స్పష్టంగా ఉండటానికి దోహదం చెస్తాయి. కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చదువుకునే పిల్లలకు గుమ్మడితో చేసిన వంటకాలు తినిపించడం ఎంతో మంచిది. ఇంకా, తల్లి కావాలనుకుంటున్నవారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. గుమ్మడిలో ఫైబర్ ఎక్కువ. కేలరీలు తక్కువ. ఇలా ఇది త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం కూడా దూరమవుతుంది.

గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది చెడు LDL కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణం నుండి రక్షిస్తుంది. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కణాలు ఆక్సీకరణం చెందినప్పుడు,.. అవి రక్త నాళాల గోడలకు అంటుకుని గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. గుమ్మడికాయలో చర్మానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయలో ఉండే, విటమిన్ సి ఆరోగ్యకరమైన చర్మానికి అవసరం. చర్మాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ అనే ప్రొటీన్‌ను తయారు చేయడానికి శరీరానికి ఈ విటమిన్ అవసరం. అంతేకాదు, గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం