బొల్లితో బాధపడేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

సాధారణంగా ఈ సమస్య చేతులు, కాళ్లు, ముఖం మీద మొదలవుతుంది. కానీ శ్లేష్మ పొరలు, కళ్ళు, లోపలి చెవితో సహా శరీరంలో ఎక్కడైనా వ్యాపించవచ్చు.

బొల్లితో బాధపడేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Vitiligo
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 01, 2022 | 7:59 PM

చర్మం రంగు, ముఖం మీద తెల్లగా మారడాన్ని బొల్లి అంటారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి కానీ అంటువ్యాధి కాదు. అన్ని వయసుల వారిలోనూ, అన్ని రకాల చర్మపు రంగుల వారిలోనూ కనిపిస్తుంది. ఈ చర్మ వ్యాధి సాధారణంగా 30 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. కొంతమందికి ముఖం మీద లేదా శరీరంలోని ఇతర భాగాలపై తెల్లటి మచ్చలు కనిపించవచ్చు. ఈ చర్మ వ్యాధి చిన్న చిన్న మచ్చలతో మొదలై క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

బొల్లితో బాధపడుతున్న రోగులకు వైద్యపరంగా గుర్తింపు పొందిన ఆహారం లేదు. అయినప్పటికీ, కొన్ని ఆహారాలు తీసుకోవడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చాలా అధ్యయనాలు చూపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. కొన్ని ఆహారాలకు భిన్నంగా స్పందించవచ్చు. సాధారణంగా ఈ సమస్య చేతులు, కాళ్లు, ముఖం మీద మొదలవుతుంది. కానీ శ్లేష్మ పొరలు (నోరు, ముక్కు, జననేంద్రియాలు మరియు పురీషనాళం యొక్క తేమతో కూడిన పొర), కళ్ళు, లోపలి చెవితో సహా శరీరంలో ఎక్కడైనా వ్యాపించవచ్చు.

చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్‌ కణజాలాలు విడుదల చేసే మెలనిన్‌ అనే ప్రత్యేక పదార్థం టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. తెల్ల బొల్లి మచ్చల వ్యాధిలో ఈ ఎంజైమ్‌ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్‌ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మ రంగును కోల్పోతుంది.

ఇవి కూడా చదవండి

వైన్, బ్లూబెర్రీస్, సిట్రస్, కాఫీ, పెరుగు, చేపలు, పండ్ల రసం, ఉసిరి, ద్రాక్ష, ఊరగాయలు, దానిమ్మ, పియర్, రెడ్ మీట్, టొమాటో, గోధుమ ఉత్పత్తులు, పుల్లని పదార్థాలకు దూరంగా ఉండండి.

(గమనిక:ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. సూచనలను అనుసరించే ముందు వైద్యుడిని సంప్రదించడం అవసరం)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి