AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితంలో తొలిసారి జిలేబీ తిన్న ఫారెన్ అమ్మాయి.. ఆ రియాక్షన్‌కు అర్థమేంటో మీరైనా చెప్పగలరా..

అయితే మీరు ఎప్పుడైనా విదేశీయులు జలేబీని ప్రయత్నించడం చూశారా? చూడకపోతే గనుక.. ఈ వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పండి..

జీవితంలో తొలిసారి జిలేబీ తిన్న ఫారెన్ అమ్మాయి.. ఆ రియాక్షన్‌కు అర్థమేంటో మీరైనా చెప్పగలరా..
Foreign Woman Tries Jalebi
Jyothi Gadda
|

Updated on: Oct 01, 2022 | 7:10 PM

Share

భారతదేశంలో అనేక రకాల స్వీట్లు ఉన్నాయి..ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్వీట్‌ బాగా ఫేమస్‌.. అలాంటి స్వీట్స్‌లో జిలేబీ ఒకటి. ఎక్కువ మంది ఇష్టపడే డెజర్ట్‌లలో జిలేబీ ఒకటి. రౌండ్లుగా చుట్టి వేయించిన పిండిని.. చక్కెర పాకంలో ముంచిన తీసిన తియ్యని పదార్థం..ఇది ఎప్పుడూ తిన్నాసరే నిరాశపరచదు. అందుకే జిలేబీని చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే మీరు ఎప్పుడైనా విదేశీయులు జలేబీని ప్రయత్నించడం చూశారా? చూడకపోతే గనుక..ఈ స్టోరీ మీరు తప్పక చదవాలి. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

కొలంబియాకు చెందిన కొలెన్ గౌడ అనే మహిళ తొలిసారిగా జలేబీని ప్రయత్నించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. హనుమాన్ గౌడ, శ్రీమతి గౌడను వివాహం చేసుకున్న భారతీయుడు, తన భార్యను మిఠాయిని ప్రయత్నించమని ఒప్పించాడు. ఈ క్రమంలోనే ఆమె తన జీవితంలో తొలిసారి జిలేబీ తినడాన్ని కెమెరాలో బంధించాడు. కనీసం ట్రై చేస్తోంది కదా.. తనను క్యాన్సిల్ చెయ్యకండి అని క్యాప్షన్‌‌తో హనుమాన్ ఈ వీడియోను షేర్ చేశాడు. వీడియో ఆరంభంలో అందమైన చీరకట్టు, బొట్టుతో కనిపించిన కాలెన్.. భర్త చెప్పడంతో జిలేబీ తీసుకుంది. కొంచెం తిన్న ఆమె.. ‘ఇదేంటి ఇంత జిగురుగా (స్లైమీగా) ఉంది?’ అని అడిగింది. బలవంతం మీద మరో చిన్న ముక్క కొరికి ‘హనీ.. ఇక వద్దు’ అంటూ చేతిలోని జిలేబీని పక్కన ఉన్న వాళ్లకు ఇచ్చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆమెకు జిలేబీ నచ్చకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. భిన్నమైన కామెంట్స్‌ చేస్తూ వీడియోని మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్  న్యూస్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్