Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతుళ్ల కోరిక.. వారితో పాటు తానూ పెళ్లి చేసుకున్న తండ్రి.. ఎన్నో పెళ్లో తెలిస్తే నోరెళ్లబెడతారు..

ప్రస్తుతం, అతనికి 10 మంది పిల్లలు, 40 మంది మనుమలు ఉన్నారు. అతని కుటుంబ సభ్యుల సంఖ్య 62కు చేరింది. గత ఏడాది మార్చిలో యూట్యూబర్ తో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కూతుళ్ల కోరిక.. వారితో పాటు తానూ పెళ్లి చేసుకున్న తండ్రి.. ఎన్నో పెళ్లో తెలిస్తే నోరెళ్లబెడతారు..
Pakistani Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 01, 2022 | 4:43 PM

జీవిత భాగస్వామిని ఎంచుకోవడం చాలా మందికి ఎదురయ్యే కష్టమే..అనేక మంది వ్యక్తులు తమకు సరైనవారిని ఎంచుకోవడానికి ఏళ్ల తరబడి శోధిస్తుంటారు.. అయితే 67 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకున్న పాకిస్థాన్‌కు చెందిన షౌకత్ అనే వ్యక్తి మాత్రం ఇప్పుడు చాలా మంది దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం, అతనికి 10 మంది పిల్లలు, 40 మంది మనుమలు ఉన్నారు. అతని కుటుంబ సభ్యుల సంఖ్య 62కు చేరింది. గత ఏడాది మార్చిలో యూట్యూబర్ చౌగమ్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. అతని 5వ వివాహానికి ముందు, ఎనిమిది మంది కుమార్తెలు, 1 కొడుకు వివాహం చేసుకున్నారు. అలాగే, తన ఇద్దరు కూతుళ్లు తనను 5వ పెళ్లికి ఒప్పించారని, జీవిత చరమాంకంలో ఒంటరిగా ఉండకూడదని అడిగారని షౌకత్ తెలిపాడు.

షౌకత్‌ తన ఇద్దరు కూతుళ్లకు ఒకేసారి పెళ్లి చేశాడు. ఈ సమయంలోనే తాను కూడా 5వ పెళ్లి చేసుకున్నాడు. అలాగే షౌకత్‌ని పెళ్లి చేసుకోవడంపై వధువును ప్రశ్నించగా.. మాములుగా కాకుండా ఇంత పెద్ద కుటుంబంలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది ఆ నవవధువు.ఇక వీరు ఉంటున్న ఇళ్లు ఓ చిన్నపాటి గ్రామంలా ఉంటుందేమో మరీ.

షౌకత్‌ తరహాలోనే సౌదీ అరేబియాకు చెందిన అబు అబ్దుల్లా కూడా 63 ఏళ్ల వయసులో 53వ పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అబూ అబ్దుల్లా ఇలా అన్నాడు, నేను మొదటి వివాహం చేసుకున్నప్పుడు, నేను రెండవసారి వివాహం చేసుకోవాలనుకోలేదన్నాడు. పెళ్లి చేసుకుని పిల్లలతో హాయిగా ఉండటం మంచిది. కానీ, నా భార్యతో నాకు సమస్యలు ఉన్నాయి. ఆమె నాకంటే 6 సంవత్సరాలు చిన్నవయసు అని చెప్పాడు. అందుకే తాను మరో పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అనంతరం భార్యాభర్తలిద్దరూ ఒకేచోట ఉండడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, ఆ తర్వాత ఇద్దరికీ విడాకులు ఇచ్చి మరో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఆపై దీన్నే కొనసాగిస్తూ.. అబు ప్రస్తుతం తన 53వ వివాహం చేసుకున్నాడు. షౌకత్‌, అబు తమ జీవిత భాగస్వామి కోసం పదే పదే వెతుకుతూ పదుల సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకుంటుండగా ఇక్కడ చాలా మంది తమ మొదటి భాగస్వామి కోసం వెతుకుతూనే ఉండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, ఈ వార్తకు సంబంధించిన వీడియో పాతదే అయినప్పటికీ మరోమారు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి