Unique Love Story: గేదెను బాగా పోషించి.. యజమానురాలు మనసు గెలిచి పెళ్లి చేసుకున్న యువకుడు .. ఆసక్తికరమైన లవ్ స్టోరీ
స్థానిక మీడియా కథనాల ప్రకారం, అమ్మాయి కుటుంబ సభ్యులు తమలోని ఇంటి గేదెలను చూసుకోవడానికి 25 ఏళ్ల అమీర్‌ను నియమించుకున్నారు. ముస్కాన్ ఇంట్లో మొత్తం నాలుగు గేదెలు ఉన్నాయి
ప్రేమ , లవ్ , ఇష్క్, కాదల్ ఇలా ఎన్ని రకాల భాషల్లో ఎన్ని రకాలుగా పిలిచినా దాని భావం ఒక్కటే.. ప్రపంచంలోని అత్యంత అందమైన భావనల్లో ఒకటి ప్రేమ0. మానవ జీవితాన్ని అందంగా మారుస్తుంది.. మనుషులను మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్తుంది. ప్రేమకు వయస్సు, లాభ నష్టాలను, ఆస్థి అంతస్తులను చేసుకోదని ఎందరో కవులు చెప్పారు. ఇదే విషయాన్నీ ప్రపంచంలో జరిగిన అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రేమకు జాతి లేదు డబ్బు చూడదు. ప్రేమ ఎప్పుడు, ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా కలగవచ్చు. దీనికి ఉదాహరణగా తాజాగా పాకిస్థాన్ లో జరిగిన సంఘటన నిలుస్తోంది. సినిమా కథకు ఏ మాత్రం తీసిపోని రియల్ స్టోరీ.. చాలా ఆసక్తికరంగా ఉంది. వాస్తవానికి ఇక్కడ ఒక స్త్రీ తమ ఇంట్లో పనికి వచ్చిన వ్యక్తి నిజాయతీని ఇష్టపడి ప్రేమలో పడింది.. తన ప్రేమను వ్యక్తం చేసి.. అతడిని పెళ్లి చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అమ్మాయి పేరు ముస్కాన్ 20 ఏళ్ళు , అబ్బాయి పేరు అమీర్ 25 ఏళ్ళు అని తెలుస్తోంది. వరుడు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, అమ్మాయి కుటుంబ సభ్యులు తమలోని ఇంటి గేదెలను చూసుకోవడానికి 25 ఏళ్ల అమీర్‌ను నియమించుకున్నారు. ముస్కాన్ ఇంట్లో మొత్తం నాలుగు గేదెలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో వాటిని చూసుకోవడంలో కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. దీంతో గేదెలను చూసుకోవడానికి అమీర్‌ను పనిలో పెట్టుకున్నారు.
అమీర్ సిన్సియర్‌గా, శ్రద్ధగా పని చేసేవాడు. గేదెలను బాగా చూసుకున్నాడు. దీంతో గేదెలు మునుపటి కంటే ఎక్కువ పాలు ఇవ్వడం ప్రారంభించాయి. అమీర్ నిజాయితీ, అంకితభావం ముస్కాన్ హృదయాన్ని తాకింది. అమీర్‌ని ముస్కాన్ ను ఇష్టపడటం మొదలుపెట్టింది. తర్వాత ఓ రోజు ధైర్యం చేసి అమీర్ కు తానూ ప్రేమిస్తున్న సంగతి వెల్లడించింది. ఆ సమయంలో అమీర్ గేదెల షెడ్డులో ఉన్నాడు. గేదెలకు స్నానం చేయిస్తున్నాడు. తాను అమీర్‌ని ప్రేమిస్తున్నట్లు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది.
ముస్కాన్ చెప్పిన విషయం విన్న అమీర్ మొదట షాక్ అయ్యాడు. అయితే అతను ముస్కాన్‌ను సాయంత్రం వరకు సమయం అడిగాడు. అతను తన కుటుంబ సభ్యులతో మాట్లాడి, ముస్కాన్ ప్రతిపాదనను అంగీకరించాడు. రిపోర్ట్స్ ప్రకారం, ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. అమీర్ నాలుగు గేదెలను 40 గేదెలు చేశారు.. అంతేకాదు గేదెల సంరక్షణకు ఇప్పుడు ముగ్గురిని నియమించినట్లు ముస్కాన్ చెప్పాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..