Hindu Temple: ట్రినిడాడ్‌లోని హిందూ దేవాలయాలపై దాడి.. నగదు, నగలు దోచుకెళ్లిన దుండగులు.. విగ్రహాలు ధ్వంసం..

ట్రినిడాడ్ , టొబాగోలో వివిధ రకాల మతస్థులు అనేక సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఇక్కడ అన్ని మతాల వారు తమ ఇష్టదైవాన్ని స్వేచ్ఛను పూజించుకుంటారు. అయితే ఇప్పుడు జరుగుతున్న దాడులు చూస్తుంటే శాంతియుత వాతావరణానికి భంగం కలిగించాలని కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Hindu Temple: ట్రినిడాడ్‌లోని హిందూ దేవాలయాలపై దాడి.. నగదు, నగలు దోచుకెళ్లిన  దుండగులు.. విగ్రహాలు ధ్వంసం..
Hindu Temples In Trinidad
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2022 | 3:25 PM

ఇంగ్లండ్‌లోని హిందూ దేవాలయంపై దాడి కేసు ఇంకా పరిష్కారం కాలేదు.. మరోసారి విదేశీ గడ్డపై హిందూ దేవాలయాలపై దాడి జరిగింది. ఈసారి కరీబియన్ దేశం ఈ దాడులకు వేదిక అయ్యింది. ‘ ట్రినిడాడ్ అండ్ టొబాగో ‘ లోని ట్రినిడాడ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి . ఈ ఘటనతో అక్కడ నివసిస్తున్న హిందూ సంఘాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల్లోనే రెండు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని చెబుతున్నారు. దాడికి గురైన రెండు ఆలయాలు ద్వీపంలోని కౌవా, పెనాల్ పట్టణంలో ఉన్నాయి.

సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 28 న, కౌవాలోని కర్లీ బేలోని కాళీ మాత ఆలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి.. ఆలయం లోపల ఉన్న నగదును, నగలను దోచుకున్నారు. దీంతో పాటు కాళీమాత విగ్రహాన్ని కూడా దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహానికి ఆలివ్ ఆయిల్ కూడా పూశారు . అదే సమయంలో, దాడి చేసిన వ్యక్తులు ఆలయం గోడలపై బైబిల్ కవితను కూడా రాశారు. ఈ కవిత ద్వారా దాడి చేసినవారు హిందువులకు వ్యతిరేకంగా హెచ్చరించారు. అంతేకాదు ఆలయ బయటి గోడలపై పెద్ద ఎరుపు అక్షరాలతో ‘నిర్గమకాండము 20:3-4 చదవండి’ అని రాశాడు.

ఆలయ పూజారి పండిట్ సత్యానంద్ మహారాజ్ మాట్లాడుతూ, ఆలయ సేవకులు నవరాత్రి పూజలు ముగించుకుని వారి వారి ఇళ్లకు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని పలు భాగాలను ధ్వంసం చేశారని తెలిపారు. అమ్మవారి విగ్రహం కూడా ధ్వంసమైంది.  విగ్రహాన్ని ఆలివ్ నూనెను పూశారు. ఈ విషయమై కౌవ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పండిట్ సత్యానంద్ మహరాజ్ తెలిపారు. అయితే ఈ ఫిర్యాదు  సంబంధించిన రసీదును టీటీపీఎస్‌ ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

హిందూ సమాజంలోని ప్రజల్లో ఆగ్రహం ఆలయ పూజారి ఇంకా మాట్లాడుతూ ట్రినిడాడ్ , టొబాగోలో వివిధ రకాల మతస్థులు అనేక సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఇక్కడ అన్ని మతాల వారు తమ ఇష్టదైవాన్ని స్వేచ్ఛను పూజించుకుంటారు. అయితే ఇప్పుడు జరుగుతున్న దాడులు చూస్తుంటే శాంతియుత వాతావరణానికి భంగం కలిగించాలని కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రైస్తవ మతం ముసుగులో జరుగుతున్న ఈ హింసను ప్రజలందరూ కలిసి ఖండించాలని కోరారు. అదే సమయంలో దాడి జరిగిన తర్వాత కూడా ఆలయంలో పూజలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటన తర్వాత హిందూ సమాజం ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

పెనాల్ పట్టణంలోని గణేష్ ఆలయంలో విధ్వంసం కౌవాలోని కాళీ ఆలయంపై దాడికి ముందు సెప్టెంబర్ 22 రాత్రి పెనాల్ పట్టణంలో గణేష్ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మరుసటి రోజు ఉదయం గణేష్ ఆలయ పూజారులు ఆలయానికి చేరుకుని చూడగా ఆలయం వెనుక తలుపు పగులగొట్టి ఉండడం గమనించారు. అలాగే వినాయకుడి విగ్రహం కూడా ధ్వంసమైంది. అంతేకాదు ఆలయంలోని ఇతర దేవుళ్ల విగ్రహాల బట్టలు తీసివేశారు. దాడికి ముందు అగంతకులు ఆలయంలో సిగరెట్‌ కూడా తాగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆలయంలోని ఫ్రిజ్‌లో ఉంచిన పాలను కూడా అగంతకులు తాగి అక్కడ ఉంచిన డ్రై ఫ్రూట్స్‌ను తిన్నారు. ఆలయ ఉపాధ్యక్షురాలు రేఖా కాస్సీ మాట్లాడుతూ.. ఆలయం వెనుక తలుపు పగులగొట్టి ఉండడం చూశామని తెలిపారు. అదే సమయంలో విరాళం పెట్టెలోంచి దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో దాడికి పాల్పడిన వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..