Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేటాడబోయిన పులికి చుక్కలు చూపించిన వానరం.. కోతి చేష్టలతో ముప్పతిప్పలు పెట్టింది

ఇక తాజాగా ఓ కోతి, పులిని ఆటపట్టించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. కోతి చేష్టలతో పులికూడా పిల్లిలా మారిపోయి అవస్థలు పడాల్సి వచ్చింది.

వేటాడబోయిన పులికి చుక్కలు చూపించిన వానరం.. కోతి చేష్టలతో ముప్పతిప్పలు పెట్టింది
Monkey Plays
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2022 | 9:20 PM

సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియోలు..కొన్ని వీడియోలు ఫన్నిగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటాయి. సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. పులులు,సింహాలు, మొసళ్లు, పాములు, ఇతర జంతువులకు సంబంధించి వీడియోలు ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక తాజాగా ఓ కోతి, పులిని ఆటపట్టించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. కోతి చేష్టలతో పులికూడా పిల్లిలా మారిపోయి అవస్థలు పడాల్సి వచ్చింది.

కోతిని వేటాడేందుకు ప్రయత్నించిన పులి మనోహరమైన వీడియో సోషల్‌లో వైరల్ అవుతోంది. చెట్టుపైన ఉన్న కోతిని వేటాడేందుకు ప్రయత్నించిన పులి ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తి్స్తున్నారు. వైరల్ వీడియోలో, ఒక పులి మీడియం సైజు చెట్టు పైన కనిపిస్తుంది. పులి కొన్ని చిన్న చిన్న కొమ్మల పైన ఎగురుతూ కిందపడిపోయేలా, దాడి చేసే స్థితిలో ఉంది. అయితే కోతి పులి కింద ఉన్న కొమ్మను పట్టుకుంది. కానీ చెట్లు ఎక్కుతూ దూకుతు ఉండటం కోతులకు బాగా అలవాటైన పని..కానీ, పులులు అలా కోతుల మాదిరి చెట్లను ఎక్కలేవు. అలాంటిదే ఈ వీడియో.

ఇవి కూడా చదవండి

కోతి ఆ పరిస్థితి నుండి బయటపడటానికి ఒక మార్గాన్ని వెతకడం కోసం భలే ప్లాన్ చేసింది.  అదే సమయంలో పులిని తాను పట్టుకోగలనని భావించేలా చేస్తుంది కోతి..  పులి కోతి వైపుకి క్రిందికి దూకుతున్నప్పుడు ఆ కోతి నెమ్మదిగా పైకి దూకుతుంది. ఆ వెంటనే కిందకు దూకేస్తుంది. కోతి తన ట్రిక్‌ ప్లే చేస్తుంది. కోతి తాను పడిపోతున్నట్టుగా, పులి అతనిని వెంబడిస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంది. కానీ, కోతి పులిని బోల్తా కొట్టించి చెట్టు పైన ఉన్న కొమ్మల మీద ఊగుతూ.. ఎగురుతూ దొరక్కుండా పులికి ముచ్చెమటలు పట్టిస్తుంది.  పులి కోతిని పట్టుకోలేక కోతిలా ఎగరలేక  చివరకు నేలపై పడిపోతుంది. పాపం పులికి ఆ వానరం చుక్కలు చూపించినంత పనిచేసింది.

ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అతను తన ట్వీట్‌లో ఇలా రాశాడు “హాలత్ కా ‘షికార్’ఈ వీడియో క్లిప్‌కి 174k పైగా వీక్షణలు మరియు 8,300 లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం. ..ఇక్కడ క్లిక్ చేయండి