ఎరగా భావించి లోదుస్తులు మింగేసిన పాము.. ఎరక్కపోయి ఎలా ఇరుక్కుపోయిందో చూడండి…

ఎరగా భావించినా పాము లోదుస్తులను మింగేందుకు ప్రయత్నించింది. కానీ, అటు మింగలేక, కక్కలేక నానా అవస్థలు పడింది. చివరకు

ఎరగా భావించి లోదుస్తులు మింగేసిన పాము.. ఎరక్కపోయి ఎలా ఇరుక్కుపోయిందో చూడండి...
Snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 01, 2022 | 5:15 PM

పాము..అన్న మాట వినబడగానే చాలా మంది భయంతో పారిపోతారు. అలాంటిది పామును చూస్తే..ఇక అక్కడ్నుంచి వెంటనే పారిపోతుంటారు. మరికొందరు మాత్రం పాములను స్నేహం చేస్తుంటారు. వాటిని ముద్దు చేస్తుంటారు. ఇకపోతే, సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు చూస్తుంటాం. పాములు సాధారణంగా కొన్ని జంతువులను, ఎలుకలు, కప్పలు వంటి జీవులను తింటుంటాయి. ఇకపోతే, పాములు జంతువులను మింగేస్తున్న వీడియోలు అనేకం ఇంటర్నెట్‌లో భయం పుట్టిస్తుంటాయి. అలాంటి వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎరను కబళించేందుకు ప్రయత్నించిన పాము చేసిన తప్పిదం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎరగా భావించినా పాము లోదుస్తులను మింగేందుకు ప్రయత్నించింది. కానీ, అటు మింగలేక, కక్కలేక నానా అవస్థలు పడింది. చివరకు స్థానికులు, స్నేక్‌ క్యాచర్‌ సాయంతో ప్రాణాలతో భయటపడింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ తాలూకాలోని కోతేతిట్ గ్రామంలో శివకుమార్ అనే వ్యక్తి ఇంట్లోకి పాము ప్రవేశించింది. అయితే, దానికి అక్కడ కొన్ని బట్టలు ఉండటంతో అది ఎరగా బావించింది.. ఏంచక్కా మింగేసి కడుపు నింపుకుందామని భావించింది. ఆకలి మీదున్న ఆ పాము వెంటనే అక్కడున్న లోదుస్తులను మింగేసింది. కానీ, పాపం వాటిని పూర్తిగా మింగలేక అవస్థలు పడింది. నోట్లో నుంచి గొంతులోకి జారకపోవటంతో..అటు ఇటూ తిరుగుతూ నరకయాతన అనుభవించింది. పాము పడుతున్న కష్టాన్ని అక్కడి స్థానికులు గమనించారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌..పామును రక్షించాడు. చాకచక్యంగా అతడు పాము నోట్లో ఉన్న లోదుస్తులను బయటకు తీసి రక్షించాడు.

అనంతరం పామును అడవిలో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాములు ఆహారం కోసం ఇలాంటివి మింగడం ఎవరూ ఎప్పుడు చూసి ఉండరు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?