PM Modi 5G Services: స్వీడన్ లో కారు.. ఢిల్లీ నుంచి నడిపిన ప్రధాని.. అంతా 5జీ మాయ..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు. గతంలో ఏదైనా అద్భుతం జరగాలంటే కొన్ని సంవత్సరాల, నెలలు పట్టేవి. పరిశోధనలు..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు. గతంలో ఏదైనా అద్భుతం జరగాలంటే కొన్ని సంవత్సరాల, నెలలు పట్టేవి. పరిశోధనలు చేయడానికే ఎంతో సమయం తీసుకునేది. ఇప్పుడు కాలం మారింది. అంతా ఫాస్ట్.. ఏదైనా క్షణాల్లో జరిగిపోవల్సిందే. ఎలాంటి సమాచారమైనా వేగంగా పొందే సౌలభ్యం ఉంది. దీంతో అద్భుతాలు సృష్టించడానికి ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. టెక్నాలజీ సాయంతో ఎంతో మంది సామాన్యులు సైతం అద్భుతాలు సృష్టించే స్థాయికి ఎదుగుతున్నారు. మరోవైపు కొన్ని సంవత్సరాల క్రితం కమ్యూనికేషన్ పాస్ చేయడం కోసం మొబైల్ ఫోన్లు వాడేవారు. అవి కూడా చిన్న ఫోన్లు. టెక్నాలజీ డెవలప్ అయిన కొద్ది చిన్న ఫోన్ల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐ ఫోన్ల స్థాయికి చేరుకున్నాం. వీటిలోనూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో ఫీచర్లు.. మొబైల్స్ సంగతి కాసేపు పక్కన పెడితే మొబైల్స్ వాడాలంటే మొబైల్ నెట్వర్క్ ఎంతో ముఖ్యం. మొదట్లో 2జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువ. కొంత కాలానికి 3జీ కి అప్ డేట్ అయితే ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది. ఆ తర్వాత 4జీ ఇంకేముంది ఇంటర్నెట్ స్పీడ్ వేగం మరింత పెరిగింది. ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇప్పుడు 5జీ అంటే ఇంటర్నెట్ వేగం పెరగడమే కాదు. పెద్ద పెద్ద ఫైల్స్ ను సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని మాత్రమే కొందరికి తెలుసు. ఇక సినిమాలను కూడా తేలికగా, వేగంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని మరికొందరు ఆలోచిస్తారు. కాని 5జీ టెక్నాలజీ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ప్రారంభం రోజే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలందరికి కళ్లకు కన్పించేలా చేశారు. ఇంతకీ అదేంటనుకుంటున్నారా.. అదేనండి ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వీడన్ లో ఉన్న కారును నడిపారు. నమ్మశ్చక్యం కావడం లేదా. అయితే రీడ్ దిస్ స్టోరీ.
దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, దేశంలో 5జీ మొబైల్ సేవలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా 5జీ లింక్ సాయంతో ఇండియా మొబైల్ కాన్ఫరెన్స్ లో ఎరిక్సన్ బూత్ నుంచి యూరప్ లో కారు టెస్ట్ డ్రైవ్ చేశారు. అయితే కారు మాత్రం ఢిల్లీలో లేదు. ప్రధానమంత్రి కారు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ కారు స్వీడన్ లో ఉంది. అయితే స్వీడన్ లో ఉన్న కారును నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎరిక్సన్ బూట్ తో అమర్చడం ద్వారా ఇది సాధ్యమైంది. మానవ జీవితంలో 5జీ సాంకేతికత తీసుకువచ్చే అనూహ్యమైన మార్పులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఆస్వాదించారు. అలాగే 5జీ అనుభూతిని పొందారు.
రిమోట్ కంట్రోల్ కారు స్టీరింగ్ పట్టుకుని ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోటోను కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. భారత 5జీ టెక్నాలజీ సాయంతో ఢిల్లీ నుంచి యూరప్ లోని కారును రిమోట్ కంట్రోల్స్ ఆధారంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ టెస్ట్ డ్రైవ్ చేశారని ఆయన ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ సాంకేతికత ప్లాట్ ఫాం ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ఢిల్లీలోని ప్రగతి మైదానంలో అక్టోబర్ 1వ తేదీ శనివారం ప్రారంభమైంది. ఈ 6వ ఎడిషన్ మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం అక్టోర్ 4వ తేదీ వరకు జరగనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..