Samsung credit card: సామ్‌సంగ్‌ నుంచి క్రెడిట్‌ కార్డులు.. సూపర్ బెనిఫిట్స్‌, క్యాష్‌ బ్యాక్‌లు..

సామ్‌సంగ్‌ తాజాగా ఫైనాన్సియల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే క్రెడిట్ కార్డులను తీసుకొస్తోంది. ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన...

Samsung credit card: సామ్‌సంగ్‌ నుంచి క్రెడిట్‌ కార్డులు.. సూపర్ బెనిఫిట్స్‌, క్యాష్‌ బ్యాక్‌లు..
Samsung Credit Cards
Follow us

|

Updated on: Oct 01, 2022 | 4:34 PM

ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉందన్న విషయం తెలిసిందే. టీవీల నుంచి స్మార్ట్‌ఫోన్‌ల వరకు అన్ని రకాల గ్యాడ్జెట్లను ఈ కంపెనీ రూపొందిస్తుంది. చాలా దేశాల్లో ఈ బ్రాండ్‌కు మంచి వ్యాల్యూ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వస్తువుల తయారీ రంగంలో ఉన్న సామ్‌సంగ్‌ తాజాగా ఫైనాన్సియల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే క్రెడిట్ కార్డులను తీసుకొస్తోంది. ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ అయిన యాక్సిస్‌, వీసాతో కలిసి సామ్‌సంగ్‌ ఈ కార్డును తీసుకొస్తోంది.

ఈ క్రెడిట్‌ కార్డులతో ట్రాన్సాక్షన్స్‌ చేసే యూజర్లకు భారీ క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్లను అందించనున్నట్లు సామ్‌సంగ్ తెలిపింది. ఈ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందించనుంది. ఈఎంఐ, నాన్‌ ఈఎంఐ ట్రాన్సక్షన్స్‌ అన్నింటికీ ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సామ్‌సంగ్ తెలిపింది. అన్ని రకాల సామ్‌సంగ్‌ ప్రొడక్ట్స్‌తో పాటు ఇతర ప్రొడక్టలపై కూడా ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇక సామ్‌సంగ్‌ ఆథరైజ్డ్‌ సర్వీస్‌ సెంటర్‌లలో కూడా ఆఫర్లు పొందొచ్చు.

సామ్‌సంగ్‌ క్రెడిట్‌ కార్డును వీసా సిగ్నేచర్‌, వీసా ఇనిఫినిటీ పేర్లతో విడుదల చేస్తోంది. వీసా సిగ్నేచ‌ర్ క్రెడిట్ కార్డుపై నెల‌వారీగా రూ.2,500తోపాటు ఏడాదిలో రూ.10 వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. వీసా ఇనిఫినిటీ కార్డుపై నెల‌వారీగా రూ.5000తోపాటు ఏడాదిలో రూ.20 వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ ల‌భిస్తుంది. ఈ కార్డులతో కొనుగోలు చేసే ప్రతీ దానిపై ఎడ్జ్‌ రివార్డు పాయింట్లు పొందొచ్చు. ఇక వార్షిక ఫీజు విషయానికొస్తే సిగ్నేచ్‌ కార్డుకు రూ. 500, ఇనిఫినిటీ కార్డుకు రూ. 5000గా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్