ఇంటి నుంచి పారిపోయిన బాలికపై సామూహిక అత్యాచారం.. రూ. 50వేలకు అమ్మేసి.. దారుణం

బాలిక ఒంటరిగా ఉందని గమనించిన అర్జున్ ఆమెను తనతో పాటు తీసుకువెళ్లాడు. తన ముగ్గురు స్నేహితులకు సమాచారం ఇచ్చి పిలిపించాడు. ఆపై ముగ్గురూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. అతి దారుణంగా..

ఇంటి నుంచి పారిపోయిన బాలికపై సామూహిక అత్యాచారం.. రూ. 50వేలకు అమ్మేసి.. దారుణం
child harassment
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 01, 2022 | 5:47 PM

ఇంటి నుంచి పారిపోయి, దారితప్పి వచ్చిన బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగలేదు..వారి పైశాచికత్వం ప్రదర్శించి..50 రూపాయలకు ఆ బాలికను వ్యభిచార నిర్వాహకురాలికి అమ్మేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయిన బాలిక.. ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్‌లోని జయనగర్‌కు చేరుకుంది. జయనగర్‌లోని మార్కెట్‌లో బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్న చిన్నారిని అక్కడే ఉన్న అర్జున్ యాదవ్ అనే వ్యక్తి గమనించాడు. బాలికను కిడ్నాప్ చేసి తనతో తీసుకెళ్లి దాచి ఉంచాడని తెలిసింది. అనంతరం తన ముగ్గురు స్నేహితులను పిలిచిపించుకుని వారితో కలిసి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని మౌజిల్లాకు చెందిన పోలీస్‌ బృందం సోనీదేవి అనే మహిళా చెర నుంచి బాలికను రక్షించి కేసును చేధించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఒక మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో ఓ పోలీసులు కూడా ఉన్నట్టు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల విచారణలో బాలిక బీహార్‌కు పారిపోయిందని తేలింది. అనంతరం జయనగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం మేరకు జయనగర్ పోలీసులు సెక్స్ వర్కర్ సోని దేవి ఇంటిపై దాడి చేసి బాలికను గుర్తించారు. బాలికను రక్షించిన పోలీసులు సోనీ దేవిని అదుపులోకి తీసుకున్నారు. తదనంతరం, బాలికను మొదట అపహరించిన అర్జున్ యాదవ్, ఎలక్ట్రీషియన్ సజన్ కుమార్‌లను అరెస్టు చేశారు. కిడ్నాపర్ అర్జున్ యాదవ్ జయనగర్ మార్కెట్‌లో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలికను కిడ్నాప్‌ చేశాడు.

బాధితురాలు నెల రోజుల క్రితం తన సొంత ఊరు మౌ నుండి దారితప్పి మధుబని జిల్లా జయనగర్ పట్టణానికి చేరుకుంది. మార్కెట్‌లో ఆమెకు అర్జున్ యాదవ్ కనిపించాడు. ఆమె అతని సహాయం కోరింది. ఆమె ఒంటరిగా ఉందని గమనించిన అతను ఆమెను తనతో పాటు తీసుకువెళ్లాడు. తన ముగ్గురు స్నేహితులకు సమాచారం ఇచ్చి పిలిపించాడు. ముగ్గురూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. అర్జున్‌తో పాటు ఎలక్ట్రీషియన్‌ సజన్‌ కుమార్‌, మరో కానిస్టేబుల్‌ రామ్‌జీవన్‌ పాశ్వాన్‌ అనే వ్యక్తి ముగ్గురు కలిసి బాలికపై పలుమార్లు దాడి చేసినట్టుగా పోలీసులు తేల్చారు. చివరకు కిడ్నాప్‌ చేసిన బాలికను సోనీదేవికి రూ.50కి విక్రయించారు. కాగా, ఈ కేసులో రామ్‌జీవన్‌ పాశ్వాన్‌ అనే జయనగర్‌ కానిస్టేబుల్‌ పరారీలో ఉన్నాడని.. విచారణ కొనసాగుతోందని చెప్పారు. పరారీలో ఉన్న కానిస్టేబుల్‌ కోసం పలు చోట్ల గాలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే