వామ్మో.. ఇదేం ఫాం సామీ.. బరిలోకి దిగితే పరుగుల వర్షమే.. 24 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు.. 5 హాఫ్ సెంచరీలు..

Sarfaraz Khan: రంజీ ట్రోఫీ ఫైనల్, దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం ఇరానీ ట్రోఫీలోనూ అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు.

వామ్మో.. ఇదేం ఫాం సామీ..  బరిలోకి దిగితే పరుగుల వర్షమే.. 24 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు.. 5 హాఫ్ సెంచరీలు..
Sarfaraz Khan
Follow us

|

Updated on: Oct 02, 2022 | 1:30 AM

ప్రస్తుతం భారత యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ నిరంతరం పరుగులు తీస్తున్నాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ తాజాగా ఇరానీ ట్రోఫీతోనూ సర్ఫరాజ్ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. టోర్నెమెంట్ ఏదైనా.. తన బ్యాట్ మాత్రం సత్తా చాటుతూనే ఉంది. సర్ఫరాజ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఇరానీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఈ జట్టు 2019 రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా నిలిచిన సౌరాష్ట్రతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్స్ పూర్తిగా విఫలమవడంతో జట్టు మొత్తం 98 పరుగులకే ఆలౌట్ అయింది. సౌరాష్ట్ర జట్టు మొత్తం కంటే సర్ఫరాజ్ ఒక్కడే ఎక్కువ పరుగులు చేశాడు.

జట్టును ఆదుకున్న సర్ఫరాజ్..

సౌరాష్ట్ర కేవలం 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అభిమన్యు ఈశ్వరన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 11 పరుగులు చేసి అవుటయ్యాడు. యశ్ ధుల్ కూడా ఐదు పరుగులకు మించి వెళ్లలేకపోయాడు. అలాంటి సమయంలో మైదానంలోకి దిగిన సర్ఫరాజ్.. హనుమ విహారితో కలిసి వికెట్ పై కాలు మోపి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 92వ బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

ఇవి కూడా చదవండి

నిరంతరాయంగా దూసుకెళ్తోన్న సర్ఫరాజ్..

సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్ 2019 నుంచి కొనసాగుతుంది. ఇప్పటివరకు దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తూ వస్తున్నాడు. గత 24 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సెంచరీలు, ఐదింటిలో హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సమయంలో అతని అత్యధిక స్కోరు 301గా నిలిచింది. ఈ ఏడాది రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై తరపున ఆడుతూ సర్ఫరాజ్ సెంచరీ సాధించాడు. దీని తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్‌లోనూ అతని బ్యాట్‌తో సెంచరీ బాదాడు. ఇరానీ ట్రోఫీలో మరోసారి ఈ యువ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించాడు.

విహారి కూడా..

రెస్ట్ ఆఫ్ ఇండియా సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌తో చాలా ఉపశమనం పొందింది. అతని ఇన్నింగ్స్ బలంతో జట్టు కోలుకుంది. అయితే సర్ఫరాజ్ మాత్రమే కాకుండా భారత టెస్ట్ జట్టులో భాగమైన, రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ హనుమ విహారి కూడా అతనికి బాగా మద్దతు ఇచ్చాడు. విహారి అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు.

ముగ్గురు బౌలర్ల దెబ్బకు బోల్తా పడిన సౌరాష్ట్ర..

అంతకుముందు సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేసింది. కానీ పెద్దగా స్కోరు చేయలేకపోయింది. జట్టులో ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. ధర్మేంద్రసింగ్ జడేజా జట్టులో అత్యధికంగా 28 పరుగులు చేశాడు. అర్పిత్ వాసవాడ 22 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన ముగ్గురు బౌలర్లు కలిసి సౌరాష్ట్ర బ్యాటింగ్‌ను ఎదుర్కొన్నారు. ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ చెరో మూడు వికెట్లు తీశారు.

కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..