Dog Supernatural powers: ఈ శునకానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయా.. ఇదిగో వీడియో ప్రూఫ్..వీడియో.
కుక్కలు చూపే విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి యజమానుల కోసం ప్రాణాలు ఇచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే కుక్కలు ప్రమాదాలను ముందుగానే
కుక్కలు చూపే విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి యజమానుల కోసం ప్రాణాలు ఇచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే కుక్కలు ప్రమాదాలను ముందుగానే పసిగడతాయని పెద్దలు కూడా అంటుంటారు. అంటే విపత్తు రాబోతున్న విషయం వాటికి ముందుగానే తెలుస్తుందట. అలాంటి అతీంద్రియ శక్తి ఏదో వాటికి ఉందని చాలామంది నమ్ముతుంటారు. అయితే తాజాగా ఓ శునకం చేసిన పని.. ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చను లేవనెత్తింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఓ వ్యక్తి రోడ్డుపై నిల్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ పక్కనే ఓ శునకం కూడా ఉంది. ఈ క్రమంలో కుక్క ఒక్కసారిగా అతడి వద్దకు వెళ్లి.. వెనక నుంచి ముందుకు నెట్టేసింది. ఆపై అది కూడా వెనక్కి వెళ్లింది. ఇంతలోనే చెట్టుపై నుంచి ఒక కొమ్మ.. ఆ వ్యక్తి నిల్చున ప్లేసులో పైనుంచి పడింది. సెకన్ల వ్యవధిలో ఇదంతా జరిగిపోయింది. శునకాలకు అతీంద్రియ శక్తులున్నాయని.. అందుకే అది కొమ్మ కింద పడే విషయాన్ని ముందే పసిగట్టి ఆ వ్యక్తిని పక్కకు నెట్టిందని కొందరు కామెంట్స్ పెడుతన్నారు. అయితే ఇది ఇంటర్నెట్ మాయా ప్రపంచం.. గ్రాఫిక్స్ ద్వారా ఇది క్రియేట్ చేశారు అనేవారు కూడా లేకపోలేదు. ఇంకొందరు అయితే పక్కాగా స్క్రిప్ట్ రాసి ఇదంతా షూట్ చేశారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

