Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: సర్వరోగనివారిణి, లైంగిక జీవితానికి వరం లాంటిది ఈ డ్రై ఫ్రూట్‌.. రోజూ తింటే డబుల్ బెనిఫిట్స్..

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవనశైలి కారణంగా అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ ఒక యాపిల్ తింటే అనేక వ్యాధులు దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా

Health Tips: సర్వరోగనివారిణి, లైంగిక జీవితానికి వరం లాంటిది ఈ డ్రై ఫ్రూట్‌.. రోజూ తింటే డబుల్ బెనిఫిట్స్..
Walnuts
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 01, 2022 | 10:08 AM

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవనశైలి కారణంగా అనేక వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ ఒక యాపిల్ తింటే అనేక వ్యాధులు దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా బాదం, ఇతర డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులు మన దరిచేరవని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ అనేక వ్యాధులను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీంతో రక్తపోటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్‌, మధుమేహం వంటివి చాలా వరకు అదుపులో ఉంటాయని పరిశోధకులు తెలిపారు.

పరిశోధనలో కీలక విషయాల వెల్లడి..

డ్రై ఫ్రూట్ వాల్‌నట్ లో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. దీని ద్వారా అనేక వ్యాధులు దూరమవుతాయి. వాల్ నట్స్ లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వాల్‌నట్‌లు ఆరోగ్యానికి ఎలా దోహదపడతాయన్న విషయంపై ఓ పరిశోధనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధనలో 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల 3000 మందిని చేర్చారు. అందరూ వాల్‌నట్‌లను తీసుకోవాలని సూచించారు. అయితే.. వాల్ నట్స్ తినే వారిలో మధుమేహం, గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

రెండవ అధ్యయనం..

ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో కూడా వాల్‌నట్స్ ప్రయోజనాల గురించి ఒక పరిశోధనను ప్రచురించారు. . వాల్ నట్స్ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు 8 వారాలపాటు ప్రతిరోజూ ఒక వాల్‌నట్ తినాలని కోరారు. పరిశోధకులు పాల్గొనేవారి రోజువారీ జీవితాన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. పాల్గొనేవారు ఏమి, ఎప్పుడు తిన్నారు.. వారు ఎక్కడికి వెళతారు? ఎలా జీవిస్తున్నారు? మరి వాల్ నట్స్ రెగ్యులర్ గా తీసుకుంటున్నారా..? లేదా? అనే విషయాలపై అధ్యయనం చేశారు. పాల్గొనేవారు రోజూ వాల్‌నట్‌లు తిన్నారు. అయితే వాల్నట్స్ తినేవారిలో కొలెస్ట్రాల్, రక్తపోటు అదుపులో ఉన్నాయి. ఇది గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వాల్‌నట్‌లను తీసుకోని వ్యక్తులు ఈ వ్యాధులకు ఎక్కువ అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.

వాల్‌నట్‌ను ఎలా తినాలి..

వాల్‌నట్‌లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు తింటే దాని ప్రయోజనాలు ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రి పడుకునే ముందు 2 వాల్‌నట్‌లను నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తినండి. వాల్ నట్స్ తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. లైంగిక జీవితం మెరుగుపడటంతోపాటు పలు సమస్యలు దూరమవుతాయిని నిపుణులు వివరించారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి