- Telugu News Photo Gallery Low BP: these cheapest things can save you from low blood pressure tips in telugu
Low BP: మీరు లోబీపీతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే అద్భుతమైన ఉయోజనాలు
రక్తపోటు తక్కువగా ఉన్నా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెరుగైన జీవనశైలి, మందులతో దీనిని నివారించవచ్చు. మార్కెట్‌లో లభించే ఈ చౌక వస్తువులతో మీరు ఈ వ్యాధి నుండి మిమ్మల్ని..
Updated on: Oct 01, 2022 | 12:05 PM

రక్తపోటు తక్కువగా ఉన్నా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెరుగైన జీవనశైలి, మందులతో దీనిని నివారించవచ్చు. మార్కెట్‌లో లభించే ఈ చౌక వస్తువులతో మీరు ఈ వ్యాధి నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవచ్చు. వాటి గురించి తెలుసుకోండి.

కాఫీ: ఇంగ్లిష్ వెబ్‌సైట్ హెల్త్‌లైన్‌లో ప్రచురితమైన వార్తల ప్రకారం, మీరు లోబీపీ సమస్య నుంచి బయటపడాలంటే కాఫీని తీసుకోండి. దీని వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఉప్పు: తక్కువ ఉప్పు తీసుకోవడం కూడా లోబీపీ ఉంటుంది. BP స్థాయిని సరిగ్గా ఉంచడానికి ఉప్పు ఉన్న ఆహారంలో అలాంటి వాటిని చేర్చండి. అయితే, దీన్ని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమే. లబీపీ ఉన్నవాళ్లు కాస్త ఉప్పును ఎక్కువగా తీసుకుంటే సరైన స్థాయిలో ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.

గుడ్లు: తక్కువ బీపీని నివారించడానికి ఫోలేట్ ఎక్కువగా ఉండే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఫోలేట్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. గుడ్లలో ఫోలేట్ ఉంటుంది. మార్కెట్‌లో వాటి ధర కూడా చౌకగా ఉంటుంది. మీరు సిట్రస్ ఆహారాలను కూడా తీసుకోవచ్చు.

ఈ చిట్కాను కూడా గుర్తుంచుకోండి: తక్కువ రక్తపోటు బారిన పడకుండా ఉండటానికి, ఆహారం మాత్రమే కాకుండా, తినే విధానాన్ని కూడా మార్చడం అవసరం. ఒకే సారి కాకుండా రోజులో అప్పుడప్పుడు కొంత మొత్తంలో ఆహారం తినాలి. భారీ భోజనం చేసే పద్ధతి మిమ్మల్ని బీపీని తగ్గించడమే కాకుండా, అనేక ఇతర వ్యాధుల బారిన పడేలా చేస్తుంది.





























