Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Water: సెలబ్రిటీలు ఎగబడి తాగుతోన్న ఈ బ్లాక్‌ వాటర్‌లో అసలు ఏముంది? ఈ డ్రింక్‌ లీటర్‌ ధరెంతో తెలుసా?

మలైకా అరోరా కారణంగా మొదటిసారి ఈ బ్లాక్‌ వాటర్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆతర్వాత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఊర్వశి రౌతేలా, శ్రుతి హాసన్, కాజల్‌ అగర్వాల్‌.. తదితర సెలబ్రిటీలు కూడా ఈ హెల్దీ డ్రింక్‌ను వినియోగిస్తున్నారని తెలిసి..

Black Water: సెలబ్రిటీలు ఎగబడి తాగుతోన్న ఈ బ్లాక్‌ వాటర్‌లో అసలు ఏముంది? ఈ డ్రింక్‌ లీటర్‌ ధరెంతో తెలుసా?
Malika Arora
Follow us
Basha Shek

|

Updated on: Oct 02, 2022 | 1:44 PM

బ్లాక్‌ వాటర్‌.. చూడడానికి నల్లగా, కషాయం కంటే దారుణంగా కనిపిస్తున్న ఈ హెల్దీ డ్రింక్‌ను సినీ, క్రీడా ప్రముఖులందరూ ఎగబడి తాగుతున్నారు.  బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా కారణంగా మొదటిసారి ఈ బ్లాక్‌ వాటర్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆతర్వాత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఊర్వశి రౌతేలా, శ్రుతి హాసన్, కాజల్‌ అగర్వాల్‌.. తదితర సెలబ్రిటీలు కూడా ఈ హెల్దీ డ్రింక్‌ పేరు  మరింత పాపులరైంది. దీంతో ఆరోగ్యంపై దృష్టి సారించే క్రమంలో చాలామంది ఈ డ్రింక్ లోని మర్మమేమిటో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలో బ్లాక్‌ వాటర్‌ వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటంటే..

అందం, ఆరోగ్యం కోసం..

సాధారణంగా మనం తాగే మంచినీళ్లలో  PH ( హైడ్రోజన్ ఇయాన్స్) స్థాయి 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్‌లో అంతకుమించి ఉంటుందట. అలాగే బాడీని హైడ్రేటెడ్‌గా, ఫిట్‌గా ఉంచటంలో ఈ బ్లాక్ వాటర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తాయి. ఈ నీరు తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలు దూరమవుతాయి. బ్లాక్‌ వాటర్‌ తాగడం వల్ల చర్మం కూడా మెరుపును సంతరించుకుంటుంది. చర్మం పొడిబారదు. జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఎనర్జిటిక్‌గా ఉంటారు. మెదడు పనితీరు మెరుగుపడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అతిగా వద్దు..

మనం రోజూ తీసుకునే నీటిలో సాధారణంగా  ఇన్ ఆర్గానిక్ సాల్ట్స్ ఉంటాయి. అయితే బ్లాక్ వాటర్ లో నీరు ఎక్కువ ఆల్కలీన్‌గా ఉంటుంది. వేసవిలో ఈ నీటిని ఎక్కువగా తీసుకుంటే.. సన్‌స్ట్రోక్‌ నుంచి బయటపడవచ్చు. ఇది శరీర వేడిని తగ్గిస్తుంది. అలాగే రక్తపోటును అదుపులో ఉంచడం, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే ఈ బ్లాక్‌ వాటర్‌ను మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం కొన్ని సమస్యలు తప్పవు. ఒక్కోసారి వాంతులు కూడా రావొచ్చు. కాబట్టి ఆరోగ్య నిపుణులు సూచించిన మోతాదులోనే బ్లాక్‌ వాటర్‌ ను తీసుకోవాలి. ఇక మార్కెట్లో బ్లాక్‌ వాటర్‌ లీటర్‌ రూ.500కు పైగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..