AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Brahmotsavalu: భక్తులతో కిక్కిరిసిపోతున్న ఏడుకొండలు.. ఎటుచూసినా, ఎక్కడ చూసినా భక్తులే..

రెండేళ్ల తరువాత కోనేటిరాయుడికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుగిరులు..

Tirumala Brahmotsavalu: భక్తులతో కిక్కిరిసిపోతున్న ఏడుకొండలు.. ఎటుచూసినా, ఎక్కడ చూసినా భక్తులే..
Srivari Brahmotsavalu (1)
Ganesh Mudavath
|

Updated on: Oct 02, 2022 | 6:51 AM

Share

రెండేళ్ల తరువాత కోనేటిరాయుడికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుగిరులు సందడిగా మారాయి. ఏడుకొండలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్త జన సందోహం పోటెత్తుతోంది. ఎటుచూసినా, ఎక్కడ చూసినా భక్తులే. కొండపైనా, కింద కింద ఒకటే రద్దీ. ఒకవైపు భక్తులు, మరోవైపు వాహనాలు. తిరుమల, తిరుపతి, అలిపిరి ఎక్కడ చూసినా వాహనాలే. లక్షల మంది, వేలాది వాహనాలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. రెండేళ్ల కరోనా పాండమిక్‌ గ్యాప్‌ తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులకు అనుమతివ్వడంతో ప్రపంచ నలుమూలల నుంచి భక్తజనం పోటెత్తుతున్నారు. టీటీడీ ఊహించిన దాని కంటే ఎక్కువగా భక్తులు తరలి వస్తుండటంతో వాళ్లను కంట్రోల్‌ చేయడం పోలీసులకు కష్టంగా మారుతోంది. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకొస్తుండటంతో అదుపు చేయడానికి నానాతిప్పలు పడాల్సి వస్తోంది. భక్తులను నియంత్రించలేక అష్టకష్టాలు పడుతున్నారు పోలీసులు.

తిరుమాడ వీధుల్లో గ్యాలరీలన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో భక్తుల మధ్య తోపులాట జరుగుతోంది. ఒకే సారి మూడు లక్షల మంది భక్తులు వచ్చినా తట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. ఐదు వేలమంది పోలీసులతో బందోబస్తు సిద్ధం చేశారు. అయినా అవి సరిపోవడం లేదు. పార్కింగ్‌ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. దాంతో అలిపిరి కిందే వాహనాలను నిలిపేస్తున్నారు. లేపాక్షి, మ్యూజియం ప్రాంతాల్లో కొంత తోపులాట జరిగింది. పోలీసులకు, బయట నుంచి వచ్చిన పోలీసులకు తమ వారిని అనుమతించే విషయమై చోటుచేసుకున్న వాగ్వాదం తోపులాటకు దారితీసింది. అదే మార్గంలో క్యూలైన్‌లోకి భక్తులు ఒక్కసారిగా రావడంతో కొందరు పడిపోయారు. పోలీసులు అప్రమత్తమై కిందపడిన వారిని లేపడంతో ప్రమాదం తప్పింది.

Tirumala Brahmotsavalu

Tirumala Brahmotsavalu

కాగా.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం రాత్రి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాఢ వీధుల్లో భక్తుల కోలాట నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఏనుగులు, అశ్వాలతో గరుడవాహన సేవ కన్నుల పండువగా సాగింది. గరుడసేవను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల భక్తజనసంద్రంగా మారింది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ప్రత్యేక స్థానం ఉంది. గరుడ వాహనంపై విహరించిన శ్రీమలయప్పస్వామికి వెల కట్టలేనన్ని ఆభరణాలతో అలంకరిస్తారు. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్