Love: రెండు కాళ్లు పోయినా అతనే జీవితమనుకుంది.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిపీటలెక్కింది..

అంతా సవ్యంగా జరుగుతోంది అనుకునేలోపే ప్రియుడికి యాక్సిడెంట్ జరిగింది. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. అవిటివాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు అంటూ యువతి తల్లిదండ్రులు వారించారు. కానీ ప్రేమకు ఇవేవి తెలియదు కదా.

Love: రెండు కాళ్లు పోయినా అతనే జీవితమనుకుంది.. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిపీటలెక్కింది..
Prakash, Divya
Follow us
Basha Shek

|

Updated on: Oct 02, 2022 | 10:42 AM

వారిద్దరూ ఐదేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కులాలు కూడా ఒక్కటే కావడంతో పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది. అయితే వారి ప్రేమ బంధాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకునేలోపే ప్రియుడికి యాక్సిడెంట్ జరిగింది. రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. అవిటివాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు అంటూ యువతి తల్లిదండ్రులు వారించారు. కానీ ప్రేమకు ఇవేవి తెలియదు కదా. అందుకే కాళ్లు లేకపోయినా.. కుటుంబ సభ్యులు వారించినా ఐదేళ్లుగా ప్రేమిస్తున్నవాడితోనే పెళ్లిపీటలెక్కింది. తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని వెల్లియూర్‌ లో జరిగిన​ఈ ఘటన నిష్కల్మషమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది.

అతనితోనే నా జీవితం..

వివరాల్లోకి వెళితే..కేసవనేరి గ్రామానికి చెందిన ప్రకాశ్(25), వల్లియమ్మాల్​పురానికి చెందిన దివ్య(22) గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. అయితే అంతలోనే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు ప్రకాశ్‌. చెన్నై నుంచి బైక్​పై వస్తున్న అతను ప్రమాదవశాత్తూ కిందపడడంతో వెన్నెముక దెబ్బతింది. రెండు కాళ్లు చచ్చబడిపోయాయి. దీంతో మంచానికే పరిమితయ్యాడు ప్రకాశ్‌. ఇదే సమయంలో అతనితో పెళ్లి వద్దంటూ దివ్య తల్లిదండ్రులు ఆమెను వారించారు. అయితే ఇవేవీ పట్టించుకోలేదు దివ్య. ప్రేమించిన వాడితోనే నా జీవితం అంటూ తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది. ప్రకాశ్‌తోనే ఏడడుగులు నడిచింది.

మా ఇద్దరినీ కలపండి సార్..

కాగా ఈ విషయం తెలుసుకున్న దివ్య కుటుంబ సభ్యులు ప్రకాశ్ ఇంటికి వచ్చి గొడవకు దిగారు. దివ్యను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో ప్రకాశ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దివ్య కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుని ఆమెను, తనను కలపాలని కోరుతున్నాడు. కాగా ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కాళ్లు పోయినా ప్రియుడినే పెళ్లిచేసుకున్న దివ్యను అందరూ మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
అదానీపై కేసుతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం..
అదానీపై కేసుతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం..
'పెట్టుబడులకు గుజరాత్ ప్రపంచ వేదికగా మారింది'.. గుజరాత్‌ సీఎం
'పెట్టుబడులకు గుజరాత్ ప్రపంచ వేదికగా మారింది'.. గుజరాత్‌ సీఎం
విమానంలో సిగరెట్‌ తాగాడు.. ఆ తర్వాత ??
విమానంలో సిగరెట్‌ తాగాడు.. ఆ తర్వాత ??