AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Clapping Benefits: చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా ? తెలిస్తే ఆశ్చర్యపోతారంతే!

జుకు కనీసం 5-6 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలా పడితే అలా చప్పట్లు కొడితే ఈ ప్రయోజనాలు వర్తించవు.

Clapping Benefits: చప్పట్లు కొట్టడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా ? తెలిస్తే ఆశ్చర్యపోతారంతే!
Clapping
Basha Shek
|

Updated on: Oct 05, 2022 | 8:55 AM

Share

సాధారణంగా మనం ఇతరులను అభినందించడానికే, ఉత్సాహపరచడానికే ఎక్కువగా చప్పట్లు కొడతాం. అయితే ఇలా చప్పట్లు కొట్టడం వల్ల పలు వ్యాధులు నయం అవుతాయట. పైగా ఇందులో ఎలాంటి శారీర శ్రమ ఉండదు. రోజుకు కనీసం 5-6 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలా పడితే అలా చప్పట్లు కొడితే ఈ ప్రయోజనాలు వర్తించవు. రెండు చేతులను మీ భుజాలకు ఎదురుగా పైకి లేపండి. చేతులను వీలైనంత వెడల్పుగా చాచి చప్పట్లు కట్టాలి. ఒక నిమిషం పాటు నెమ్మదిగా చప్పట్లు కొట్టండి. కాస్త అలసటగా అనిపిస్తే, మీ చేతులకు ఒకటిన్నర నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత మరో నిమిషం పాటు చప్పట్లు కొట్టండి. ఇలా 4-5 సార్లు చేయండి. ఒక వారంలో మీరు దానికి అలవాటు పడతారు. నిమిషానికి సుమారు 50 నుండి 100 క్లాప్స్ కొట్టవచ్చు. అంటే 5 నిమిషాల్లో 300 నుండి 500 సార్లు చప్పట్లు కొట్టవచ్చు.

మధుమేహం, రక్తపోటు నియంత్రణలోకి..

ఉదయం రోజువారీ పనులు ముగించుకున్న తర్వాత 5 నిమిషాలు చప్పట్లు కొట్టడం అలవాటుగా పెట్టుకోండి. ఆ తర్వాత 5 నిమిషాలు పడుకుని, అవయవాలను రిలాక్స్ చేసి, శవాసనం చేయాలి. ఇలా చేయడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయట. శరీరంలోని కొవ్వు తగ్గిపోతుంది. రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మధు మేహం నియంత్రణలోకి వస్త్ఉంది. కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరం ఉత్తేజంగా మారుతుంది. చప్పట్లు కొట్టడంలో ఆక్యుప్రెషర్ సూత్రం దాగి ఉంది. ఇందులో రెండు అరచేతులపై ఉన్న వేల పాయింట్లపై చప్పట్లు కొట్టడం వల్ల ఒత్తిడి ఏర్పడి రక్తప్రసరణ సాఫీగా జరగడమే ఆరోగ్య ప్రయోజనాలకు కారణమని వైద్యులు చెబుతున్నారు.

పైసా ఖర్చు లేకుండా..

రోజూ చప్పట్లు కొట్టడం ద్వారా పొట్ట సమస్య, మెడ, నడుము నొప్పి, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ వ్యాయామంలో చప్పట్లు కొడితే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. రోజురోజుకూ వైద్యం ఖరీదుగా మారుతున్నప్పుడు పైసా ఖర్చు లేకుండా చప్పట్లు కొట్టే అలవాటు అలవర్చుకుంటే పలు అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి..