Ranga Reddy: యూట్యూబ్‌లో చూసి ఫేక్ కరెన్సీ తయారీ.. రద్దీ మార్కెట్లలో వస్తువుల కొనుగోలు.. పోలీసులకు ఎలా చిక్కారంటే?
రాజేంద్రనగర్, మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీని తరలిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి లక్ష రూపాయల నగదు, కంప్యూటర్, హార్డ్ డిస్క్, స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్‌లైన్ దునియాలో ఏ సమాచారం కావాలన్నే క్షణాల్లో దొరికిపోతుంది. కానీ యూట్యూబ్ వీడియోలు చూసి ఓ గ్యాంగ్ ఫేక్ కరెన్సీ తయారీ మొదలుపెట్టింది. రంగారెడ్డి జిల్లాలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టియింది. రాజేంద్రనగర్, మైలార్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీని తరలిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి లక్ష రూపాయల నగదు, కంప్యూటర్, హార్డ్ డిస్క్, స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ ఎక్కడ నుంచి వస్తోంది. ఎవరు ముద్రిస్తున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారని విచారణ చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యకర విషయం వెలగులోకి వచ్చింది. యూట్యూబ్ లో వీడియోలు చూసి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ కరెన్సీ ముద్రణ ప్రారంభించినట్టు తమ విచారణలో తేలిందన్నారు ఏసీపీ గంగాధర్. ఈ నకిలీ కరెన్సీతో కాటేదాన్ రద్దీ మార్కెట్లో పది దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసినట్టు తెలింది.
ఇటీవల నకిలీ నోట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. ఈజీగా మనీ సంపాదించాలన్న దురాశతో కొంతమంది కేటుగాళ్లు నకిలీ నోట్ల దందాలోకి దిగుతున్నారు. చాలా మంది చిరు వ్యాపారులు నకిలీ నోట్లతో భారీగా నష్టపోతున్నారు. నకిలీ నోట్లను గుర్తించే నైపుణ్యం లేకపోవడంతో అమాయకులు నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. పలుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. చివరికి యూట్యూబ్‌లో చూసి ఫేక్ కరెన్సీ ముద్రించే వరకూ వచ్చాయి ఫేక్ గ్యాంగ్స్. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..