Women Asia Cup: ఆసియా కప్‌లో అదరగొడుతోన్న టీమిండియా.. హ్యాట్రిక్ విజయంతో అగ్రస్థానం..

IND vs UAE: ఆసియా కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. టీం ఇండియా తమ మూడో మ్యాచ్‌లో యూఏఈపై 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Women Asia Cup: ఆసియా కప్‌లో అదరగొడుతోన్న టీమిండియా.. హ్యాట్రిక్ విజయంతో అగ్రస్థానం..
India Women Vs United Arab Emirates Women
Follow us
Venkata Chari

|

Updated on: Oct 05, 2022 | 8:44 AM

ఆసియా కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకపోతోంది. ఆసియా కప్‌లో యూఏఈపై భారత మహిళల జట్టు 104 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 178 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన యూఏఈ జట్టు 74 పరుగులకే ఆలౌటైంది. ఆసియా కప్‌లో యూఏఈని ఓడించి భారత్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.

యూఏఈతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. భారత్ తరపున జెమీమా రోడ్రిగ్స్ 45 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 75 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. జెమీమాతో పాటు దీప్తి శర్మ కూడా అద్భుత ప్రదర్శన చేసి 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 64 పరుగులతో అర్ధ సెంచరీ చేసింది.

104 పరుగుల తేడాతో భారీ విజయం..

భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన యూఏఈ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమే చేసి 104 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్ తరపున దీప్తి శర్మ 64 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 75 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. దీప్తి శర్మ 49 బంతుల్లో 64 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టింది. అదే సమయంలో జెమీమా రోడ్రిగ్స్ 45 బంతుల్లో అజేయంగా 75 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు కొట్టింది.

యూఏఈతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడకపోవడం గమనార్హం. హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో భారత జట్టుకు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది. భారత జట్టు తమ చివరి మ్యాచ్‌లో మలేషియాను ఓడించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 104 పరుగుల భారీ తేడాతో యూఏఈని ఓడించింది. ఆసియా కప్‌లో భారత జట్టుకు ఇది వరుసగా మూడో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో టీమిండియా మూడు విజయాలతో మొత్తం 6 పాయింట్లు సాధించి, అగ్రస్థానంలో నిలిచింది.