AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajinkya Rahane: శుభవార్త చెప్పిన టీమిండియా క్రికెటర్‌.. సోషల్‌ మీడియాలో అభినందనల వెల్లువ

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ అజింక్య రహానె తండ్రిగా రెండోసారి ప్రమోషన్ పొందాడు. అతని భార్య రాధిక ధోపావ్కర్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Ajinkya Rahane: శుభవార్త చెప్పిన టీమిండియా క్రికెటర్‌.. సోషల్‌ మీడియాలో అభినందనల వెల్లువ
Ajinkya Rahane
Basha Shek
| Edited By: |

Updated on: Oct 06, 2022 | 11:02 AM

Share

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ అజింక్య రహానె తండ్రిగా రెండోసారి ప్రమోషన్ పొందాడు. అతని భార్య రాధిక ధోపావ్కర్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రహానే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఈ ఉదయం రాధిక, నేను మా ప్రపంచంలోకి మగబిడ్డను ఆహ్వానించాం. రాధిక, బాబు ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు రహానే. దీంతో రహానె దంపతులకు తోటి క్రికెటర్లతో పాటు అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

ఛటేశ్వర్‌ పూజారా, రాబిన్‌ ఊతప్ప, మయాంక్‌ అగర్వాల్‌, కృనాల్‌ పాండ్యా, ప్రజ్ఞాన్‌ ఓజా, కోల్‌కతా నైట్‌ రైడర్స్ తదితరులు రహానేకు విషెస్‌ చెప్పిన వారిలో ఉన్నారు. కాగా రహానే, రాధిక చిన్ననాటి స్నేహితులు. కాలేజీ రోజుల్లో క్రమంగా వీరి స్నేహం ప్రేమగా మొగ్గ తొడిగింది. పెద్దల ఆశీస్సులు కూడా లభించడంతో 2014లో మరాఠీ సంప్రదయా పద్ధతిలో రహానే- రాధికల వివాహం జరిగింది. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా 2019 అక్టోబర్‌లో ఆర్య అనే కూతురు పుట్టింది. తాజాగా అబ్బాయి పుట్టడంతో రెండోసారి తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారీ లవ్లీ కపుల్‌. కాగా రహానె ప్రస్తుతం దులీప్‌ ట్రోఫీలో ఆడుతున్నాడు. వెస్ట్‌జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం