IND vs SA 1st ODI: ‘అందరి దృష్టి టీ20 ప్రపంచ కప్‌పైనే.. నా ఫోకస్ మాత్రం దానిపైనే’ : శిఖర్ ధావన్
2023 World Cup: చాలా కాలం క్రితమే టెస్ట్, టీ20 ఫార్మాట్లలో టీమ్ ఇండియా ప్లాన్‌లకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్, వన్డే ఫార్మాట్‌లో ఇప్పటికీ టీమ్ ఇండియాలో ముఖ్యమైన భాగం.
శిఖర్ ధావన్ తన కెరీర్‌లో ముఖ్యంగా.. గడిచిన సంవత్సరాలలో టీమిండియా తరపున ఆడేందుకు పెద్దగా అవకాశాలు పొందలేదు. కానీ, అతను ఇప్పటికీ ODI ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టుకు కీలకంగా మారాడు. అయితే, ప్రస్తుతంటీ20 ప్రపంచ కప్‌పై అందరి దృష్టి ఉంది. కానీ, మరోవైపు సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం ధావన్ దృష్టి అంతా వచ్చే ఏడాది పాటు ఫిట్‌గా ఉండేందుకు కోరుకుంటున్నాడు. తద్వారా అతను 2023 ప్రపంచ కప్‌ను ఆడే అవకాశం ఉంది.
ధావన్ తొలిగా టెస్టు, ఆ తర్వాత టీ20 ఫార్మాట్‌లో టీమిండియాకు దూరమయ్యాడు. ఆయన స్థానంలో కొత్త, యువ ఆటగాళ్లు చేరారు. అయినప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో టీమ్ ఇండియాలో అతని స్థానం గురించి ఎటువంటి సందేహం లేదు. ఈ ఫార్మాట్‌లో జట్టు వ్యూహాలలో అతను ముఖ్యమైన భాగంగా ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సొంతగడ్డపై జరగనున్న ప్రపంచకప్‌నకు సన్నద్ధమవుతున్నాడు.
ధావన్ లక్ష్యం – 2023 ప్రపంచకప్..
టీ20 ప్రపంచకప్‌నకు ముందు జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌పై పెద్దగా దృష్టి సారించకపోవడానికి ఇదే కారణం. కానీ, ఈ సిరీస్ ధావన్‌కు మాత్రం చాలా కీలకం. అక్టోబర్ 5, బుధవారం విలేకరుల సమావేశంలో ధావన్‌లో తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ఇంత అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉండటం నా అదృష్టం. అవకాశం దొరికినప్పుడల్లా నా ఎక్స్‌పీరియన్స్‌ను యువకులతో పంచుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది మాత్రమే కాదు, 158 వన్డేల్లో 6647 పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్, ఈసారి తన టార్గెట్ గురించి కూడా చెప్పుకొచ్చాడు.
Preps ✅#TeamIndia ready for the #INDvSA ODI series. ? ? pic.twitter.com/5fY3m1a8lq
— BCCI (@BCCI) October 6, 2022
ఇప్పుడు నాకు కొత్త బాధ్యత ఉంది. కానీ, నేను సవాళ్లలో అవకాశాలను వెతుక్కుంటూ దాన్ని ఆనందిస్తున్నాను. నా లక్ష్యం 2023 ప్రపంచకప్. నేను ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను. అలాగూ సానుకూలంగా ఉండాలనుకుంటున్నాను అంటూ తెలిపాడు.
వన్డే ఫార్మాట్‌లో టీమ్ ఇండియా సారథిగా..
ధావన్ వన్డే ఫార్మాట్‌లో ఆడుతున్నాడు. కానీ, ఇందులోనూ అప్పుడప్పుడు జట్టును నడిపించే అవకాశం పొందుతున్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాతో T20 ప్రపంచ కప్ ఆడేందుకు వెళుతున్నారు. ఈ సిరీస్‌లో భాగం కానందున, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో జట్టుకు కెప్టెన్‌గా ధావన్ వ్యవహరించనున్నాడు. ధావన్ గతంలో శ్రీలంక, వెస్టిండీస్ పర్యటనల్లో కూడా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
టీమిండియా ప్లేయింగ్ XI: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డి కాక్, జన్నెమాన్ మలన్, టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, మార్కో జాన్సెన్, లుంగి ఎన్‌గిడి, కగిసో రబాడా
స్క్వాడ్‌లు:
భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పటీదార్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, రాహుల్ త్రిపాఠి, ముఖేష్ కుమార్, రుతురాజ్ గైక్వాడ్ , షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్
దక్షిణాఫ్రికా జట్టు: జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్(కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ఆండీల్ ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ, అన్రిచ్ నార్ట్జే, హెయిన్, హెయిన్ లుంగీ ఎన్గిడి, రీజా హెండ్రిక్స్