Cricket: లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఛాంపియన్ ఇండియా క్యాపిటల్స్.. 104 పరుగుల తేడాతో భారీ విజయం..
ప్రస్తుతం క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి ప్రపంచ క్రికెట్ జట్లు వివిధ దేశాలతో టీ20, వన్డే మ్యాచ్ లు ఆడుతోంది. అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఆయా క్రికెట్లు జట్లు సమాయత్తమవుతున్నాయి. ఇదే సమయంలో..
ప్రస్తుతం క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి ప్రపంచ క్రికెట్ జట్లు వివిధ దేశాలతో టీ20, వన్డే మ్యాచ్ లు ఆడుతోంది. అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఆయా క్రికెట్లు జట్లు సమాయత్తమవుతున్నాయి. ఇదే సమయంలో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని.. విశ్రాంతిలో ఉన్న సీనియర్లు కూడా లెజెండ్ లీగ్ క్రికెట్ లో క్రికెట్ అభిమానులను అలరించారు. అక్టోబర్ 5వ తేదీ బుధవారం ఈ లెజెండ్ లీగ్ క్రికెట్ టోర్నీ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో ఇండియా క్యాపిటల్స్, భిల్వారా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా క్యాపిటల్స్ 104 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఎంతటి టార్గెట్ నైనా చేధించే సత్తా ఉన్న బ్యాట్స్ మెన్స్ ఉన్నప్పటికి 212 పరుగుల లక్ష్య చేధనలో భిల్వారా కింగ్స్ బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు. దీంతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఛాంపియన్స్ గా ఇండియా క్యాపిటల్స్ నిలిచింది. దీంతో భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సి)లో ఇండియా క్యాపిటల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. బుధవారం జైపూర్ వేదికగా సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా క్యాపిటల్స్ 104 పరుగుల తేడాతో భిల్వారా కింగ్స్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. గౌతమ్ గంభీర్ సారథ్యంలోని ఇండియన్ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఢిల్వారా కింగ్స్ 18.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది.
ఇండియా క్యాపిటల్స్ బ్యాట్స్ మెన్లలో రాస్ టేలర్ 41 బంతుల్లో 82, మిచెల్ జాన్సన్ 35 బంతుల్లో 62 పరుగులు చేసి ఐదో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో ఇండియా క్యాపిటల్స్ భారీ స్కోర్ చేయగలిగింది. భిల్వారా కింగ్స్ ఓపెనర్లు మోర్నే వాన్ వైక్ 5, విలియం పోర్టర్‌ఫీల్డ్ 12 పరుగులు మాత్రమే చేశారు. ప్రతి ఇన్నింగ్స్ లో తనదైన బ్యాటింగ్ స్టైల్ తో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసే యూసుఫ్ పఠాన్ కూడా 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. షేన్ వాట్సన్ 27 పరుగుల వద్ద రనౌట్ కావడంతో భిల్వారా కింగ్స్ కష్టాల్లో పడింది. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లు పవన్ సుయాల్, పంకజ్ సింగ్, ప్రవీణ్ తాంబే లు ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసుకున్నారు.
బ్యాటింగ్ తో పాటు మంచి బౌలింగ్, ఫీల్డింగ్ చేయడంతో ఇండియా క్యాపిటల్స్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భిల్వారా కింగ్స్ కు బౌలర్లు శుభారంభాన్ని అందించారు. 21 పరుగులకే ఇండియా క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రాస్ టేలర్, జాన్సన్ కింగ్స్ వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు చేసింది ఇండియా క్యాపిటల్స్. దీంతో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ విజేతగా నిలిచింది.
Time for #legendary Celebrations! ?@CapitalsIndia#BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/XBFMJtj6Zf
— Legends League Cricket (@llct20) October 5, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..