Mallikarjun Kharge: మల్లికార్జున్ ఖర్గే సీఏం ఆశలు నెరవేరుతాయా.. త్రిముఖ పోటీలో ఆ నాయకుడి అవకాశాలు ఎంత..

మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. కొన్ని సంవత్సరాల నుంచి హస్తం పార్టీకి ఎంతో విదేయత చూపిస్తూ.. పార్టీనే నమ్ముకున్న వ్యక్తి. పదవీ వ్యామోహం లేకుండా పార్టీ కోసం పనిచేసే కొద్దిమంది వ్యక్తుల్లో మల్లికార్జున్ ఖర్గే కూడా ఒకరు. పార్టీని నమ్ముకున్న వారికి, నమ్మకంతో పనిచేసే నాయకులకు..

Mallikarjun Kharge: మల్లికార్జున్ ఖర్గే సీఏం ఆశలు నెరవేరుతాయా.. త్రిముఖ పోటీలో ఆ నాయకుడి అవకాశాలు ఎంత..
Mallikarjun Kharge
Follow us

|

Updated on: Oct 05, 2022 | 8:02 PM

మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. కొన్ని సంవత్సరాల నుంచి హస్తం పార్టీకి ఎంతో విదేయత చూపిస్తూ.. పార్టీనే నమ్ముకున్న వ్యక్తి. పదవీ వ్యామోహం లేకుండా పార్టీ కోసం పనిచేసే కొద్దిమంది వ్యక్తుల్లో మల్లికార్జున్ ఖర్గే కూడా ఒకరు. పార్టీని నమ్ముకున్న వారికి, నమ్మకంతో పనిచేసే నాయకులకు అడగకుండానే పరిగెత్తుకుంటూ పదవులు వస్తాయంటే ఇదేనేమో.. అందుకే మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ముందున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ఎక్కువ మంది పార్టీ శ్రేణులు ఖర్గే వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మల్లికార్జున్ ఖర్గే తో పాటు శశిథరూర్ పోటీలో ఉన్నప్పటికి.. పార్టీ నాయకుల మొగ్గు థరూర్ వైపు కన్పించడం లేదు. ఒకవేళ పార్టీ అధ్యక్షుడు అయినప్పటికి.. ఖర్గే సీఏం కావాలనే కల మాత్రం ఇప్పటివరకు నెరవేరలేదు. కొన్ని సందర్భాల్లో సీఏం అయ్యేందుకు అవకాశాలు వచ్చి కొన్ని కారణాల వల్ల చేజారిపోయాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకుల్లో సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే. కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికైతే.. కర్ణాటక రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అయినా సీఏం కావాలనే ఆశ నెరవేరుతుందా అనేది ఎంతో ఆసక్తికరంగా మారనుంది. ఎందుకంటే పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అధ్యక్షుడి అనుమతితోనే తీసుకోవల్సి ఉంటుంది. ఒకవేళ ముఖ్యమంత్రిని ఎన్నకునే అధికారం పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్నప్పటికి.. ఆ నిర్ణయానికి అధ్యక్షుడి ఆమోదం తప్పనిసరి. జాతీయ పార్టీల్లో అయితే ఇలాంటి నిబంధనలు తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. పార్టీ హైకమాండ్ తో పాటు అధ్యక్షుడి నిర్ణయం మేరకే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇప్పటివరకు కర్ణాటక సీఏం పదవికి ప్రధాన పోటీదారులుగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకె.శివకుమార్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మల్లికార్జున ఖర్గే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సీఏం అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుడు అవుతాడా అనే చర్చ మొదలైంది. లేదా వేరే ఎవరైనా నాయకుడిని ఖర్గే ప్రతిపాదిస్తారా అనేది చాలా ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు అయితే మాత్రం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఏంని నిర్ణయించడంలో మల్లికార్జున ఖర్గే పాత్రను ఏమాత్రం తీసిపారేయలేం. కర్ణాటకకు చెందిన నాయకుడు కావడం, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలపై అవగాహన కలిగిఉండటంతో పాటు.. కర్ణాటక రాజకీయాల్లో కొట్టిన పిండి మాదిరిగా ఉన్నారు మల్లికార్జున ఖర్గే. దేశంలోని అత్యున్నతమైన పార్లమెంటు ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ పక్ష నాయకుడిగా చేసిన అనుభవం మల్లికార్జునఖర్గే కు ఉంది. లోక్ సభ, రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పక్ష నాయకుడిగా పనిచేసిన మల్లికార్జున ఖర్గే ప్రత్యేక గుర్తింపు పొందారు. కర్ణాటక సీఏం అయ్యే అవకాశాలను మూడు సార్లు ఆయన తృటిలో చేజార్చుకున్నారు. అయినా సరే పదవి రాలేదనే కారణంగాతో ఏనాడూ పార్టీని వీడాలనే ఆలోచన చేయలేదు. అలాగే పార్టీపై బహిరంగంగా ఎప్పుడూ విమర్శలు కూడా చేయలేదు మల్లికార్జున్ ఖర్గే. ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చాలా కీలకంగా ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే పార్టీని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడంతో ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇదే సందర్భంలో వీరిద్దరితో పాటు మల్లికార్జున్ ఖర్గే పేరు కూడా సీఏం రేసు పరిశీలనలో ఉండే అవకాశం ఉంటుంది.

పార్టీ జాతీయ అధ్యకుడయ్యే ఛాన్స్

137 ఏళ్ల చరిత్ర ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు మల్లికార్జున్ ఖర్గేకు మెండుగా ఉన్నాయి. ఐదు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో పదవుల కోసం వెంపర్లాడకుండా తనకు అప్పగించిన బాధ్యతలను, పదవులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ వచ్చారు. మొత్తం మీద తన పొలిటికల్ కెరీర్ చివరి దశలో కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో కర్ణాటక సీఏం కావాలనే తన ఆశయాన్ని కూడా భవిష్యత్తులో ఆయన నెరవేర్చుకోవచ్చనే అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. సుమారు 24 సంవత్సరాల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కానున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టకూడదని నిర్ణయించుకోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాజస్థాన్ సీఏం అశోక్ గెహ్లాట్ వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. అయితే సచిన్ పైలట్ సీఏం కాకుండా ఉండేందుకు అశోక్ గెహ్లాట్ వ్యవహరించిన తీరుతో అప్రమత్తమైన పార్టీ.. ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం భవిష్యత్తులో ప్రమాదకరం అని భావించింది. ఆ తర్వాత సీనియర్ నాయకుల్లో ఒకరైన ఖర్గేను పార్టీ అధ్యక్షుడి స్థానానికి సరైన ఎంపికగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ భావించినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో దిగ్విజయ్ సింగ్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని పార్టీ భావించి.. ఆయనను ఢిల్లీకి పిలిపించినప్పటికి.. చర్చోపచర్చల తర్వాత దిగ్విజయ్ సింగ్ వైపు పార్టీ మక్కువ చూపించలేదు. దీంతో మల్లికార్జున ఖర్గేను పోటీలో ఉండాలని అధిష్టానం కోరడంతో ఆయన పార్టీ ప్రతిపాదనకు ఒప్పుకుని నామినేషన్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి

తృటిలో చేజారిన సీఏం అవకాశాలు

కర్ణాటక సీఏం అయ్యే అవకాశాలు మూడు సార్లు చేజారినప్పటికి పార్టీకి ఎంతో విధేయుడిగా పనిచేశారు మల్లికార్జున్ ఖర్గే. అలాగే కర్ణాటక నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు ఖర్గే. శాసనసభకు వరుసగా 9 సార్లు, రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు ఆయన. 2009 ఎన్నికల్లో లోక్ సభ సభ్యుడిగా గెలవడానికి ముందు ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న చాలా సందర్భాల్లో ఆయన మంత్రివర్గంలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కేంద్ర కార్మిక, సామాజిక న్యాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ కేబినేట్ లో పనిచేశారు. 1999. 2004, 2013లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను ఖర్గే తృటిలో కోల్పోయారు. 2008 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఆ సమయంలో తన ఆశను నెరవేర్చుకోవడానికి అవకాశం లభించినప్పటికి.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో ఆయన ఆశలు అడియాశలయ్యాయి. కర్నాటకలో యడియూరప్ప నేతృత్వంలోని BJPకి 110 సీట్టు రాగా, కాంగ్రెస్ 80 సీట్లు మాత్రమే సాధించింది.

సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నప్పటికి స్కామ్ లు, వివాదాలకు దూరంగా ఉంటూ మల్లికార్జున్ ఖర్గే తన క్లీన్ ఇమేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉండటానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆసక్తి చూపించలేదు. ఈ సమయంలో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గేను ఎంపిక చేశారు. ఆయన తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ.. కేంద్రప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నించేవారు. దీంతో సమర్థమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఖర్గే.

2019 ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే నియోజకవర్గమైన కల్బుర్గిలో బీజేపీకి పెద్దగా బలం లేదు. అయితే ఎలాగైనా ఖర్గేను ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కు చెందిన ఉమేష్ జాదవ్ బీజేపీ పార్టీలో చేర్చుకుని.. ఆ పార్టీ టికెట్ ను కేటాయించారు. 96,000 ఓట్ల తేడాతో మల్లికార్జున్ ఖర్గేను ఓడించారు ఉమేష్ జాదవ్. దీంతో తన రాజకీయ జీవితంలో ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా ఖర్గే ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించింది. రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ పదవీకాలం పూర్తయిన తర్వాత.. కాంగ్రెస్ పక్ష నాయకుడిగా హస్తం పార్టీ మల్లికార్జున్ ఖర్గేను నియమించింది.

కర్ణాటక కాంగ్రెస్ లో ఖర్గే సీనియర్ లీడర్ కావడంతో వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రియల్ లో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రతి ముఖ్యనాయకుడు గురించి, నియోజకవర్గాల్లో పరిస్థితులు ఖర్గేకు తెలుసు. దీంతో పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉండటంతో ఖర్గే ఈ ఎన్నికల్లో పార్టీ తీసుకునే కీలకనిర్ణయాల్లో కీలక భాగస్వామి కానున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు చాలా ముఖ్యమైన పని. అభ్యర్థుల తుది జాబితాను తయారుచేయడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్‌తో సహా దాదాపు 12 మంది ప్రముఖ పార్టీ నాయకులతో కూడిన పార్టీలోని కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. దీనిలో ఖర్గే ముఖ్యపాత్ర పోషించే అవకాశం లేదు. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే మాత్రం మల్లికార్జున్ ఖర్గే కూడా సీఏం రేసులో ఉండే అవకాశం లేకపోలేదు. తద్వారా ఆయన సీఏం కావాలనే తన ఆశను నెరవేర్చుకోవడానికి అవకాశంగాలేకపోలేదు. చివరికి ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిన అంశం.

మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
ఇంట్లోనే షాంపూ తయారీ.. దెబ్బకి జుట్టు పొడుగ్గా అవ్వాల్సిందే!
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!