Economic Recession: రానున్న 12 నెలల్లో ఆర్ధిక మాంద్యం.. సర్వేలో బయటపడ్డ కీలక విషయాలు!

వచ్చే6 నెలల్లో దాదాపు 46 శాతం గ్లోబల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ (సీఈఓ) తమ ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించుకోవాలని యోచిస్తున్నాయి. ఇక 39 శాతం మంది సీఈఓలు ఇప్పటికే కొత్త నియామకాలను నిలిపివేశారు. ఉన్నట్టుండి హడావిడిగా..

Economic Recession: రానున్న 12 నెలల్లో ఆర్ధిక మాంద్యం.. సర్వేలో బయటపడ్డ కీలక విషయాలు!
Economic Recession
Follow us

|

Updated on: Oct 05, 2022 | 7:53 PM

వచ్చే6 నెలల్లో దాదాపు 46 శాతం గ్లోబల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ (సీఈఓ) తమ ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించుకోవాలని యోచిస్తున్నారు. ఇక 39 శాతం మంది సీఈఓలు ఇప్పటికే కొత్త నియామకాలను నిలిపివేశారు. ఉన్నట్టుండి హడావిడిగా సీఈఓలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నారా? వచ్చే 12 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తనున్నట్లు దాదాపు 86 శాతం మంది సీఈఓలు విశ్వసిస్తున్నట్లు కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ ఏదాడి జూలై 12 నుంచి ఆగస్టు 24 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1,325 సీఈఓల అభిప్రాయాలను ఈ కంపెనీ సేకరించింది. కరోనా మహమ్మారి తర్వాత కోలుకోవడం కష్టతరం అవుతుందని వీరంతా అభిప్రాయపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, ఇటలీ, జపాన్‌, స్పెయిన్‌, బ్రిటన్‌, అమెరికా వంటి దేశాల్లో బ్యాంకింగ్‌, రిటైల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, హెల్త్‌ కేర్‌, టెక్నాలజీ తదితర రంగాల కంపెనీల్లోని సీఈఓలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఐతే 58 శాతం సీఈవోలు మాత్రం రానున్న ఆర్ధిక మాంద్యం తీవ్రంగా ఉండకపోవచ్చని, స్వల్పంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఐతే రాబోయే ఆరు నెలల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత బలంగా ఉంటుందని మెజారిటీ సీఈవోలు బలంగా నమ్ముతున్నారు. వచ్చే మూడేళ్లలో తమ ఉద్యోగులు పూర్తిగా ఆఫీసులకు వచ్చి పనిచేయడమే మేలని 65 శాతం మంది సీఈఓలు వెల్లడించారు. ఇక 28 శాతం హైబ్రిడ్‌, 7 శాతం మంది సీఈవోలు వర్క్‌ ఫ్రమ్‌ హోంకు మద్ధతు తెలిపారు.