Shanmukh Jaswanth: లగ్జరీ కారు కొని లిఫ్ట్‌ ఇస్తానంటోన్న యూట్యూబ్‌ స్టార్‌.. ధర తెలిసి షాక్‌ అవుతోన్న ఫ్యాన్స్‌

దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న షణ్ణూ బిగ్‌ బాస్‌లో సిరి హనుమంతుతో ప్రేమ వ్యవహారం నడిపి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత దీప్తి సునయనతో బ్రేకప్ కావడంతో కొద్ది రోజుల పాటు సామాజిక మాధ్యమాలకు దూరమయ్యాడు.

Shanmukh Jaswanth: లగ్జరీ కారు కొని లిఫ్ట్‌ ఇస్తానంటోన్న యూట్యూబ్‌ స్టార్‌.. ధర తెలిసి షాక్‌ అవుతోన్న ఫ్యాన్స్‌
Shanmukh Jaswanth
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2022 | 6:30 AM

యూట్యూబర్‌గా, టెలివిజన్‌ పర్సనాలిటీగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్‌ జస్వంత్‌. ముఖ్యంగా ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, సూర్య వెబ్‌ సిరీస్‌లతో బోలెడు ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నాడు. ఇదే పాపులారిటీతో బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుడు పెట్టి మరింత క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. తనదైన ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచాడు. అయితే అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న షణ్ణూ బిగ్‌ బాస్‌లో సిరి హనుమంతుతో ప్రేమ వ్యవహారం నడిపి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత దీప్తి సునయనతో బ్రేకప్ కావడంతో కొద్ది రోజుల పాటు సామాజిక మాధ్యమాలకు దూరమయ్యాడు. అయితే మళ్లీ యాక్టివ్‌గా మారి ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌ సిరీస్‌తో ఫ్యాన్స్‌ని పలకరించాడు. ఆ మధ్యన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన ఈ యూట్యూబ్‌ స్టార్‌ తాజాగా తన అభిమానులకు మరో శుభవార్త చెప్పాడు. విజయదశమిని పురస్కరించుకుని లగ్జరీ బ్రాండ్‌ బీఎండబ్ల్యూ సిరీస్‌ కారును కొన్నాడు.

దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన షణ్నూ ‘ ఫైనల్లీ.. ఇదంతా కలలా ఉంది. నా ఫ్యామిలీ తర్వాత నన్ను ఈ పొజిషన్‌లో చూడాలనుకున్నది మీరే.. నాట్‌ ఫ్రెండ్స్‌ ఓన్లీ మీరే. ఐలవ్‌యూ 3000. ఇది మన కార్‌. బయట ఎప్పుడు కనిపించినా చెప్పండి. పక్కాగా లిఫ్ట్‌ ఇస్తా’ అంటూ తన ఆనందానికి అక్షరరూపమిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. షణ్ముఖ్‌కు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కారు ధర సుమారు రూ. 45 లక్షలని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు