Prabhas: రావణ దహనంలో పాల్గొన్న ఆదిపురుష్.. అభిమానుల అరుపులు, కేరింతలతో హోరెత్తిన ఢిల్లీ రామ్‌లీలా మైదానం
కిక్కిరిసిన జన సందోహం మధ్య విల్లు ఎక్కుపెట్టి రావణ దిష్టిబొమ్మకు సంధించాడు ప్రభాస్. ఈ సమయంలో ప్రభాస్ అభిమానులు కేరింతలతో రామ్ లీలా మైదానం హోరెతెత్తింది.
దేశమంతటా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విజయదశమిని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో రావణ దహన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం లవ్ కుశ్ రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. కిక్కిరిసిన జన సందోహం మధ్య విల్లు ఎక్కుపెట్టి రావణ దిష్టిబొమ్మకు సంధించాడు ప్రభాస్. ఈ సమయంలో ప్రభాస్ అభిమానులు కేరింతలతో రామ్ లీలా మైదానం హోరెతెత్తింది. కాగా భారతీయ సంస్కృతి పట్ల ప్రభాస్‌కు ఉన్న అంకిత భావం చూసే ఆయనను ముఖ్య అతిథిగా పిలిచినట్లు లవ్ కుశ్ రామ్ లీలా కమిటీ అధ్యక్షుడు అర్జున్ కుమార్ తెలిపారు.
అందుకే ప్రభాస్‌ను ఆహ్వానించాం..
కాగా రామ్‌లీలా మైదానంలో విజయదశమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఈ రావణ దహనం కార్యక్రమం జరగలేదు. దీంతో ఈసారి ఈ వేడుకలను మరింత ఘనంగా జరపాలని ముందుగానే నిర్ణయించారు నిర్వాహకులు. ఇందులో భాగంగా ప్రభాస్‌ను అతిథిగా ఆహ్వానించామన్నారు. ‘బాహుబలి లాంటి కథతో పాటు ఇప్పుడు ఆదిపురుష్ లాంటి పౌరాణిక చిత్రంలో ఆయన నటించారు. రాముడి పాత్రలో నటించచినందునే రావణ దహనం కార్యక్రమం ఆయన చేతుల మీదుగా నిర్వహించాం’ అని కమిటీ నిర్వాహకులు తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో ఆదిపురుష్ టీం సైతం సందడి చేసింది. ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్, టీ సిరీస్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులతో ఫొటోలు దిగడంతో పాటు వాళ్లిచ్చిన బహుమతులను స్వీకరించాడు ప్రభాస్. ఇక కార్యక్రమం చివర్లో.. రామావతారంలో ఉన్న నటులకు డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి హారతి పట్టాడు ప్రభాస్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
PROUD MOMENT ??#Prabhas fired arrows to burn the Ravan Effigy in #RavanDahan.#JaiShreeRam #Adipurush pic.twitter.com/FlIVhJBngn
— Prabhas (@PrabhasRaju) October 5, 2022
#Prabhas sets the Ravana’s effigy on fire in Delhi’s #RavanDahan ?? pic.twitter.com/GVXhmj2Hcp
— Prasad Bhimanadham (@Prasad_Darling) October 5, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..