Ponniyin Selvan Movie: ముదురుతున్న పొన్నియన్ సెల్వన్ వివాదం.. చోళులు హిందువులు కాదంటూ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
కళలకు భాష, కులం, మతం లేదని.. వీటి ప్రాతిపదికన సినీ పరిశ్రమలో రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ హితవు పలికారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పొన్నియన్ సెల్వన్ సినిమాను ప్రజలు ఆదరించలేదంటూ వివాదం సృష్టిస్తున్నారని.. అది సరికాదన్నారు.
కోలీవుడ్ లో పొన్నియన్ సెల్వన్ సినిమా వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఇప్పటికే రజనీకాంత్, ఖుష్బూ వంటి వారు ఈ సినిమాపై స్పందించగా.. ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ పొన్నియన్ సెల్వన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చోళరాజుల హిందువులు కాదంటూ కమలహాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రాజరాజ చోళుడి కాలంలో హిందుత్వం లేనే లేదన్నారు. అప్పట్లో హిందూమతం లేదని.. శైవం, వైష్ణవం మాత్రమే ఉన్నాయని చెప్పారు. మనదేశంలోకి బ్రిటిష్ వారు అడుగు పెట్టిన తర్వాత మనల్ని ఎలా పిలవాలో తెలియక అప్పుడు వారు హిందువులని సంబోధించారని పేర్కొన్నారు కమల్ హాసన్.
కళలకు భాష, కులం, మతం లేదని.. వీటి ప్రాతిపదికన సినీ పరిశ్రమలో రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ హితవు పలికారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పొన్నియన్ సెల్వన్ సినిమాను ప్రజలు ఆదరించలేదంటూ వివాదం సృష్టిస్తున్నారని.. అది సరికాదన్నారు. తమిళులు.. తెలుగు సినిమా శంఖారాభరణం ఆదరిస్తే .. తెలుగువారు కోలీవుడ్ సినిమా మరో చరిత్రని ఆదరించారంటూ గుర్తు చేశారు కమల్ హాసన్.. అసలు సినిమాకు బాషాలేదని.. ఏ భాష లోనైనా సినిమా బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు లోకనాయకుడు కమల్ హాసన్.
మణిరత్నం కలల చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్, కార్తి, త్రిష, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..