AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Scheme: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు వచ్చేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం: దేశంలోని రైతులు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీపావళికి ముందే 12వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో..

PM Kisan Scheme: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు వచ్చేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
PM Kisan
Subhash Goud
|

Updated on: Oct 07, 2022 | 3:51 PM

Share

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం: దేశంలోని రైతులు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీపావళికి ముందే 12వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తరపున అధికారికంగా సమాచారాన్ని జారీ చేసింది. మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ 17 లేదా 18వ తేదీన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలోని కోట్లాది మంది రైతులు 2000 రూపాయల కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే దీపావళికి ముందే ఈ డబ్బును బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి అవసరమైన ఈకేవైసీ కారణంగా దేశంలోని చాలా మంది అనర్హులు ఉండటంతో రైతులకు డబ్బు అందడంలో జాప్యం జరుగుతోంది.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి స్కీమ్‌ కింద రైతుల ఖాతాల్లో సంవత్సరానికి రూ.6000 చొప్పున జమ చేస్తోంది. ఈ డబ్బులను రూ.2000 చొప్పున ఏడాదిలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. పీఎం కిసాన్ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటి వరకు 10 కోట్ల మంది రైతుల ఖాతాలకు 11 విడతల సొమ్ము చేరింది.

 హెల్ప్‌లైన్ నంబర్‌:

ఇవి కూడా చదవండి

రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి కిసాన్ నిధి యోజన కోసం చేసిన దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి, రైతులు 155261కి కాల్ చేసి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. మీరు ఇంకా దరఖాస్తు చేసుకోనట్లయితే, అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా సదరు రైతు పేరును నమోదు చేయడం ద్వారా పీఎం కిసాన్‌ ప్రయోజనాన్ని పొందవచ్చు. కాగా, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్‌ పథకం ఒకటి. రైతులకు ఆసరాగా ఉండేందుకు ఉచితంగా ఈ డబ్బులను అందజేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
ఇలా చేస్తే దెబ్బకు డయాబెటిస్‌ రివర్స్..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
రాత్రిపూట అకస్మాత్తుగా మేల్కొంటున్నారా..? ప్రమాదంలో ఉన్నట్లే..
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? తక్కువ వడ్డీకే రుణాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజర్ పోస్టుల కోసం అప్లై చేయండి
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేసిన యూవీ..చూస్తే కడుపుబ్బ నవ్వాల్సిందే
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే!
30 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగి అలసటగా అనిపిస్తుందా?
30 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా బరువు పెరిగి అలసటగా అనిపిస్తుందా?
సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్
సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్
లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదంటే?
లండన్, ప్యారీస్ కాదు.. 2026లో ప్రపంచ పర్యాటకుల తొలి ఎంపిక ఏదంటే?