Vegetable Price: అక్కడ భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. రేట్లు పెరగడానికి కారణం ఇదే

కూరగాయ ధరలు మరింతగా పెరిగాయి. నవరాత్రుల సందర్భంగా నాన్‌వేజ్‌ తీసేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా ఆకు కూరలు, ఇతర కూరగాయలనే వండుతున్నారు..

Vegetable Price: అక్కడ భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. రేట్లు పెరగడానికి కారణం ఇదే
Vegetable Market
Follow us
Subhash Goud

|

Updated on: Oct 06, 2022 | 6:50 PM

కూరగాయ ధరలు మరింతగా పెరిగాయి. నవరాత్రుల సందర్భంగా నాన్‌వేజ్‌ తీసేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా ఆకు కూరలు, ఇతర కూరగాయలనే వండుతున్నారు. అంతేకాకుండా నవరాత్రుల సందర్భంగా చాలా మంది అన్నదానం నిర్వహిస్తున్నారు. దీంతో నిర్వాహకులు పెద్ద ఎత్తున కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు కూరగాయల ధరలు మరింతగా పెరిగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ధరలు ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఒక్కసారిగా పెరగడం సామాన్య ప్రజలను కలవరపెడుతోంది. ఇక్కడి వీక్లీ మార్కెట్‌లో వారం రోజుల క్రితం కిలో 20 నుంచి 30 రూపాయల వరకు లభించే కూరగాయలు.. ఇప్పుడు ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. అయితే బయటి నుంచి వచ్చే కూరగాయలకు గణనీయంగా కొరత ఏర్పడిందని హోల్‌సేల్ మార్కెట్ నుంచి వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు, డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో సామాన్యులకు ఇబ్బందిగా మారింది. మార్కెట్లోకి వెళ్లి కూరగాయలు కొనాలంటేనే భయపడుతున్నారు.

అయితే ఢిల్లీలోని నీతి బాగ్ నివాసి పూజా ఠాకూర్ గత తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష ముగించుకుని కూరగాయల కోసం మార్కెట్‌ వెళ్లారు. మార్కెట్లో కూరగాయల ధరలను విన్న ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వారం క్రితం కిలో క్యాబేజీ రూ.60 ఉండగా రూ.80కి చేరింది. నేడు దాని ధర కిలో 120 నుండి 200 రూపాయలు. అంటే 30 రూపాయల క్యాబేజీ ఇప్పుడు 50 రూపాయలకు చేరింది. ఇక నిమ్మకాయ కిలో రూ.120 నుంచి 150 వరకు విక్రయిస్తున్నారు.

రూ.70కి చేరిన ముల్లంగి:

ఇవి కూడా చదవండి

నోయిడా సమీపంలోని డి బ్లాక్‌లోని బుధవారం నాటి వీక్లీ మార్కెట్‌లో కూరగాయల ధర అత్యధికంగా ఉంది. 10 రోజుల క్రితం కిలో రూ.30 ఉన్న టమాటా ధర ఇప్పుడు రూ.70గా ఉందని ప్రజలు చెబుతున్నారు. ముల్లంగి ధర వారం క్రితం రూ.20 నుంచి 25 ఉండగా, దాని ధర కూడా కిలో రూ.60 నుంచి 70 పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఘాజీపూర్ కూరగాయల మార్కెట్ సమీప ప్రాంతంలో కూడా ధరలు భారీగానే ఉన్నాయి. గత వారం రోజుల నుంచి హోల్ సేల్ మార్కెట్ లోనే కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయని కూరగాయల దుకాణం ఏర్పాటు చేసిన సంజయ్ కుమార్ చెబుతున్నారు. కూరగాయలు పెరిగిపోతుంటే.. తాము కూడా ఖరీదైన ధరలకు అమ్ముకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు పెరగడానికి ఇదే కారణం

ఆజాద్‌పూర్ సబ్జీ మండి కార్యదర్శి రాజీవ్ సింగ్ పరిహార్ టీవీ9తో మాట్లాడుతూ.. దేశంలోని గత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని, దీని కారణంగా కూరగాయలు మార్కరెట్లోకి రావడం తగ్గిందని, దీని కారణంగా ధరలు పెరిగాయన్నారు. క్యాబేజీతో సహా ఆకు కూరగాయలు ఎక్కువ పెరిగాయి. ఎందుకంటే వరుసగా కొన్ని రోజులుగా వాతావరణంలో అవాంతరాల వల్ల కూరగాయలు పొలాల్లోనే కుళ్లిపోతున్నాయి.

అదే సమయంలో నవరాత్రుల సందర్భంగా ఢిల్లీలో నాన్ వెజ్ తినేవారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో కూరగాయల కొనుగోళ్లు పెరిగిపోయాయి. ఈ ధరలు కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు. దీనితో పాటు ఢిల్లీలో నవరాత్రుల సందర్భంగా చాలా మంది సామూహిక విందులు ఏర్పాటు చేస్తున్నారు. వారంతా కూరగాయలను నేరుగా మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తారు. దీంతో హోల్ సేల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్న చిరు దుకాణదారులు కూరగాయలను ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి కొన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి