EPFO: బిగ్ అలెర్ట్.. మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ డబ్బు కనిపించడం లేదా? వివరాలు ఇవిగో

మీ పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ డబ్బు కనిపించడం లేదా.? వడ్డీ పడలేదని కంగారు పడుతున్నారా.? దీనిపై కేంద్ర ఆర్ధిక శాఖ క్లారిటీ ఇచ్చింది.. మీరే చూడండి..

EPFO: బిగ్ అలెర్ట్.. మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ డబ్బు కనిపించడం లేదా? వివరాలు ఇవిగో
EPFO
Follow us

|

Updated on: Oct 06, 2022 | 3:44 PM

మీకు పీఎఫ్ ఖాతా ఉందా.? అయితే మీకోసం ఓ బిగ్ అలెర్ట్. మీ వడ్డీ డబ్బులు ఖాతాల్లో కనిపించట్లేదా.? అయితే టెన్షన్ పడకండి. అవి ఎక్కడికీ పోలేదు. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ కారణంగా వడ్డీ డబ్బు మొత్తం ఈపీఎఫ్ స్టేట్‌మెంట్‌లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

ప్రతీ ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును నిర్ణయించి.. ఆ తర్వాత కొద్ది నెలలకు సంబంధిత లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించగా.. ఆ వడ్డీ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లోకి 2021 డిసెంబర్‌లో జమ చేసింది. ఇక 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ 8.1 శాతం వడ్డీ రేటుగా ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. అయితే ఇప్పటిదాకా ఆ వడ్డీ డబ్బు అకౌంట్లలోకి జమ కాలేదు. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి సర్వత్రా ప్రశ్నలు తలెత్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ ‘ డియర్ ఈపీఎఫ్ఓ.. నా పీఎఫ్ వడ్డీ ఎక్కడ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై కేంద్ర ఆర్ధిక శాఖ స్పందించింది. పన్ను మార్పులు కారణంగా ఈపీఎఫ్‌ఓ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. దీని వల్ల ఏ ఒక్క లబ్దిదారుడికి వడ్డీ డబ్బు ఈపీఎఫ్ స్టేట్‌మెంట్‌లో కనిపించడం లేదని పేర్కొంది. ఎవ్వరూ కూడా వడ్డీ డబ్బును కోల్పోలేదని.. ప్రతీ ఒక్కరి ఖాతాల్లోకి వడ్డీ క్రెడిట్ అయిందని తన ట్వీట్‌లో స్పష్టం చేసింది. అలాగే సెటిల్‌మెంట్స్ చేసుకునే అవుట్ గోయింగ్ సబ్‌స్క్రైబర్లకు, ఉపసంహరణ కోరే సబ్‌స్కైబర్లకు వడ్డీతో సహా చెల్లింపులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.