Cheque Bouncing Case: చెక్ బౌన్స్ కేసులో ఇక కొత్త నిబంధనలు వస్తాయి.. అవేంటో తెలుసా..
చెక్కు జారీ చేసేవారి ఖాతా నుండి ఏదైనా ఇతర చెల్లింపు చేసే ముందు.. వీలైతే, బౌన్స్ అయిన చెక్కును బ్యాంకింగ్ వ్యవస్థలోనే చెల్లించాలని పరిశ్రమల మండలి సూచించింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం..
చెక్ బౌన్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు పరిశ్రమల విభాగం పీహెచ్‌డీసీసీఐ సూచించింది. చెక్ బౌన్స్ విషయంలో.. బ్యాంక్ నుంచి చెక్కు జారీ చేసిన వారి ఉపసంహరణను కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని పరిశ్రమ సంఘం తెలిపింది. ప్రభుత్వం అటువంటి చట్టాన్ని తీసుకురావాలని, చెక్కు చెల్లించని తేదీ నుండి 90 రోజులలోపు ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించాలని పిహెచ్‌డిసిసిఐ తెలిపింది.
చెక్ అంటే..
ఓ నిర్ధిష్ట బ్యాంకులో నిర్ధిష్ట వ్యక్తికి నిర్ణీతమొత్తం చెల్లించాలని కోరుతూ బేషరతుగా ఇచ్చిన లిఖిత పూర్వక ఆర్డరు చెక్కు అంటారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం సెక్షన్ 6 ప్రకారం బ్యాంకు పేరిట రాసి ఇచ్చిన బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్. చెక్కు గ్రహీతకు బ్యాంకు వారు చెక్కు రాసి ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడ డబ్బు ఉన్నప్పుడు దానిని స్వీక రించి డబ్బు చెల్లిస్తారు. చెక్కును ఎండార్స్ మెంట్ ద్వారాగాని స్వాధీనం చేయడం ద్వారా గాని బదిలీ చేయవచ్చు.
ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి..
ఆర్థిక వ్యవస్థల్లో లావాదేవీలు నిర్వహించడానికి చెక్కు అనేది చాలా ముఖ్యమైనదిగా సాధనం. ఆర్థిక లావాదేవీల్లో ఈ చెక్కు కీలక పాత్ర పోషిస్తోంది. వివిధ రకాల కొనుగోలుదారులు చేసే చెల్లింపుల కోసం దీనిని ఉపయోగిస్తారు. చెక్కును వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు వినియోగిస్తుంటాయి. అంతర్గతంగా ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు నగదును బదిలీ చేయడానికి లేదా నగదును తీసుకోవడానికి ఈ చెక్కును వినియోగిస్తారన్న విషయం తెలిసిందే. సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా కలిగిన వ్యక్తి చెక్కులను బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. పలు రకాల చెల్లింపుల కోసం ఈ చెక్కులను వినియోగించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో జారీ చేసిన చెక్కు బౌన్స్ అవుతుంటుంది. ఇందుకు పలు రకాల కారణాలు ఉంటాయి. ఏ సందర్భాల్లో ఇలాంటివి జరుగుతుంటాయో చూద్దాం.
కొనుగోలుదారు-అమ్మకందారుల్లో అపనమ్మకం ఏర్పడుతోంది..
చెక్ బౌన్స్ సమస్యను పరిశ్రమ లేవనెత్తిందని పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు ఇటీవల రాసిన లేఖలో పేర్కొంది. పీహెచ్‌డీసీసీఐ జనరల్ సెక్రటరీ సౌరభ్ సన్యాల్ మాట్లాడుతూ.. “భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి వ్యాపారాన్ని సులభతరం చేయడంపై దృష్టి సారిస్తోంది. కాబట్టి, చెక్కుల బౌన్స్‌కు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది కొనుగోలుదారు.. విక్రేత మధ్య అపనమ్మకాన్ని సృష్టిస్తుంది.
చెక్కు జారీ చేసేవారి ఖాతా నుండి ఏదైనా ఇతర చెల్లింపు చేసే ముందు.. వీలైతే, బౌన్స్ అయిన చెక్కును బ్యాంకింగ్ వ్యవస్థలోనే చెల్లించాలని పరిశ్రమల మండలి సూచించింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ)కి చెక్ బౌన్స్ కేసు చాలా ఖరీదైనదని.. దీనికి న్యాయవాదులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. గణాంకాల ప్రకారం, ప్రస్తుతం 33 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసులు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం