AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ. ఏ మాత్రం డబ్బులు ఉన్నా ముందు బంగారం కొన్ని అట్టిబెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి అవుతుందని..

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Today
Amarnadh Daneti
|

Updated on: Oct 07, 2022 | 7:07 AM

Share

బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ. ఏ మాత్రం డబ్బులు ఉన్నా ముందు బంగారం కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే కొంత ఉన్నత వర్గాలకు, ధనిక కుటుంబాలకు చెందిన వారైతే.. మార్కెట్లోకి వచ్చే నూతన మోడల్స్ ను కొనుగోలు.. ఆ ఆభరణాలతో తమను అలంకరించుకుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర కొంత తగ్గుదల కొనిపిస్తే వెంటనే కొనుగోలు చేయడం చేస్తుంటారు. మరి ఈరోజు (07 అక్టోబర్ 2022) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ మరింతగా బలపడడంతో రోజు రోజుకీ పసిడి, వెండి ధరలు పైపైకి వెళ్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే గురువారంతో పోలిస్తే శుక్రవారం గ్రాము బంగారం ధర పది రూపాయలు పెరిగింది. దీంతో గ్రాము బంగారం ధర రూ.4,785గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.47,850గా ఉంది. 24 క్యారెట్ల బంగారం చూసుకుంటే గురువారంతో పోలిస్తే శుక్రవారం గ్రాముకు రూ.10 పెరిగింది. దీంతో గ్రాము బంగారం ధర 5,220కు చేరగా, పది గ్రాముల బంగారం ధర రూ.52200గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.

వివిధ నగరాలలో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర గురువారం తో పోలిస్తే గ్రాముకు రూ.10 పెరిగింది. దీంతో గ్రాము బంగారం ధర రూ. 4,800కు చేరింది. పది గ్రాముల బంగారం ధర రూ.48,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర గురువారంతో పోలిస్తే గ్రాముకు రూ.11 పెరగడంతో ఈరోజు గ్రాము బంగారం ధర ఢిల్లీలో రూ.5,236గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.52360గా ఉంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.10 పెరిగింది. దీంతో గ్రాము బంగారం ధర ముంబైలో రూ.4,785లకు చేరుకుంది. అదే పది గ్రాముల బంగారం ధర రూ.47,850గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.10 పెరిగి గ్రాము బంగారం ధర రూ.5,220లకు చేరుకుంది. పది గ్రాముల బంగారం ధర రూ.52,200గా ఉంది.

దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కంటే చెన్నైలో పసిడి ధరలు మరింత అధికంగా ఉన్నాయి. అయితే ప్రధాన నగరాల్లో గ్రాముపై గురువారంతో పోలిస్తే శుక్రవారం పది రూపాయల పెరుగుదల ఉండగా, చెన్నైలో మాత్రం గురువారం గ్రాము బంగారం ధర రూ. 4,835గా ఉండగా, శుక్రవారం రూ.5 పెరిగి రూ.4,840కి చేరుకుంది. ఈరోజు 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.48,400గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గురువారంతో పోలిస్తే శుక్రవారం గ్రాము బంగారం ధర రూ.5 పెరిగింది. దీంతో గ్రాము బంగారం ధర రూ.5,280కు చేరుకోగా, పది గ్రాముల బంగారం ధర రూ.52,800గా ఉంది.

దేశంలో వెండి ధరలు

దేశీయంగా పసిడి ధరల బాటలో వెండి కూడా నడుస్తోంది. మన దేశంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి మరింత ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా వెండి ధర పరుగులు పెడుతూనే ఉంది. గురువారంతో పోలిస్తే పది గ్రాములకు కేవలం రూ.5 తగ్గింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలోకు రూ.500 తగ్గి కిలో రూ.66,500 లకు చేరుకుంది.

Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెక్చుతగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి కూడా ఏర్పడవచ్చు. కొనుగోలు దారులు ఈ విషయాన్నీ గమనించాల్సి ఉంటుంది.

మరిన్నిబిజినెస్ వార్తల కోసం చూడండి..

Follow Us