పన్నా గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా కనిపించిన అనుకోని దృశ్యం.. ఏంటని చూడగా కళ్లు జిగేల్

కష్టానికి, కాస్త లక్ తోడైందంటే.. మనకు అదృష్టం వరించినట్లే. ఇక్కడ ఓ వ్యక్తికి అదే జరిగింది..

పన్నా గనుల్లో తవ్వకాలు జరుపుతుండగా కనిపించిన అనుకోని దృశ్యం.. ఏంటని చూడగా కళ్లు జిగేల్
Representative Image
Follow us

|

Updated on: Oct 05, 2022 | 5:27 PM

అదృష్టం ఏ రూపంలో ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కష్టానికి, కాస్త లక్ తోడైందంటే.. మనకు అదృష్టం వరించినట్లే. ఇక్కడ ఓ వ్యక్తికి అదే జరిగింది. రాత్రింబవళ్లు ఎంతగానో శ్రమించిన అతడికి దసరా రోజున పంట పండింది. రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోయాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రాణా ప్రతాప్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని భర్కా గని ప్రాంతంలో ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ ఆరు నెలలుగా తవ్వకాలు జరుపుతున్నాడు. చివరికి అతడి కష్టం ఫలించింది. దసర రోజున అంటే మహర్నవమి(మంగళవారం) నాడు సదరు వ్యక్తికి 9.64 క్యారెట్లు విలువ చేసే వజ్రం ఒకటి దొరికింది. దాన్ని పన్నాలోని డైమండ్ ఆఫీస్‌లో డిపాజిట్ చేశాడు. రానున్న ఆక్షన్‌లో ఈ వజ్రాన్ని ఉంచనున్నట్లు రాణా ప్రతాప్ తెలిపాడు. ఈ డైమండ్ విలువ సుమారు రూ. 40 లక్షలు ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన వజ్రం దొరకడంతో రాణా ప్రతాప్ కుటుంబం ఆనందంలో మునిగి తేలుతున్నారు. కాగా, వేలంలో వచ్చిన కొంత డబ్బును పేద పిల్లల సహాయార్ధం ఖర్చు పెడతానని రాణా ప్రతాప్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..