Urinary: మూత్రం వస్తున్నా.. ఎక్కువసేపు బిగపట్టుకుంటున్నారా..? అయితే, రోగాలు కొనితెచ్చుకుంటున్నట్లే..
సాధారణంగా మన శరీరం లోపల నుంచి అన్ని రకాల టాక్సిన్స్, మలినాలు బయటకు వెళ్లినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా అవయవాలు కూడా సరిగ్గా పని చేస్తున్నాయని అర్థం.
సాధారణంగా మన శరీరం లోపల నుంచి అన్ని రకాల టాక్సిన్స్, మలినాలు బయటకు వెళ్లినప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా అవయవాలు కూడా సరిగ్గా పని చేస్తున్నాయని అర్థం. దీని కోసం సరైన విధంగా మూత్రవిసర్జన చేయడం చాలా ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. కొంత మందికి మూత్ర విసర్జన చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని మీరు చాలా సార్లు గమనించి ఉంటారు. తాజాగా దీనికి సంబంధించి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్‌కు చెందిన టెన్నిస్ నర్సు ప్రాక్టీషనర్ జానిస్ మిల్లర్ ఎక్కువసేపు మూత్రవిసర్జన చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని ప్రజలను హెచ్చరించింది.
మూత్రాన్ని ఎక్కువసేపు బిగపట్టి ఉంచితే ప్రమాదంలో పడినట్లే..
మూత్రం శరీరంలోని మలినాలను బయటకు తీయడం ద్వారా రక్త ప్రవాహాన్ని శుభ్రపరుస్తుంది. కాబట్టి మూత్రాన్ని ఎక్కువసేపు బిగపట్టి ఉంచడం వల్ల అనేక వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఏ కారణం చేతనైనా మూత్రాన్ని ఎక్కువసేపు బిగపట్టి ఉంచడం అనేది చాలా హానికరమని హెచ్చరిస్తున్నారు. మూత్రాన్ని ఎక్కువసేపు అలా ఉంచడం వల్ల మూత్రాశయంలో మంట వచ్చే ప్రమాదం ఏర్పడి.. పలు ఇన్ఫెక్షన్లు వస్తాయి.
మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం పట్టినా ప్రమాదమే..
మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం తీసుకుంటే అది వార్నింగ్ బెల్ అని నిపుణులు అంటున్నారు. ఇలా తరచూ జరుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. డైలీస్టార్‌లోని ఒక నివేదిక ప్రకారం.. 3 కిలోల కంటే ఎక్కువ బరువున్న క్షీరదాలు 21 సెకన్లలో మూత్రాశయాన్ని ఖాళీ చేస్తాయి.
యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేయడానికి 20 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే.. అలాంటి వారు చాలా కాలం పాటు మూత్రాన్ని బిగపట్టుకున్నట్లు అర్థం. మీలో కూడా ఇలా జరుగుతుంటే అలర్ట్‌గా ఉండాలంటున్నారు. ఎక్కువగా నీళ్లు తాగడం లేదా.. సరైన సమయానికి మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. లేదా అనే విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయాల గురించి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో పెద్ద వ్యాధుల ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
ఎక్కువ సేపు మూత్ర విసర్జన సమస్య, చాలా సమయం వరకు మూత్రాన్ని బిగపట్టుకుని ఉండటం లాంటి వాటిని సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో కిడ్నీల్లో రాళ్లు, పిత్తాశయంలో వాపు, ప్రోస్టేట్ వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి