AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: తిన్న తర్వాత ఈ ఎనిమిది పనులు అస్సలు చేయకూడదంట.. తప్పనిసరిగా తెలుసుకోండి..

ప్రస్తుత కాలంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు తీసుకునే ఆహారం, ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ వహించాలి. ఆహారం ఎంత క్రమశిక్షణతో తీసుకుంటే అంతే ఆరోగ్యంగా ఉంటారు.

Health Tips: తిన్న తర్వాత ఈ ఎనిమిది పనులు అస్సలు చేయకూడదంట.. తప్పనిసరిగా తెలుసుకోండి..
food
Shaik Madar Saheb
|

Updated on: Oct 05, 2022 | 5:42 PM

Share

ప్రస్తుత కాలంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు తీసుకునే ఆహారం, ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ వహించాలి. ఆహారం ఎంత క్రమశిక్షణతో తీసుకుంటే అంతే ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉంటే శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకే ఏం తినాలి, ఏది తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎంత అన్నది ముఖ్యం. దీనితో పాటు, తిన్న తర్వాత మర్చిపోయి కూడా 8 పనులు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆహారం తిన్న తర్వాత మనం అనుసరించే పలు అలవాట్లు మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారం విషయంలో పదే పదే తప్పులు చేయడం సరికాదంటూ సూచిస్తున్నారు. సమయానికి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. తిన్న తర్వాత పలు అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆహారం తిన్న తర్వాత ఇలాంటి పనులకు దూరంగా ఉండండి..

ఇవి కూడా చదవండి
  1. వ్యాయామం మానుకోండి: ఆహారం తిన్న తర్వాత ఎప్పుడూ వ్యాయామం చేయవద్దు. ఇది జీర్ణక్రియను పాడు చేస్తుంది. అలా చేయడం వల్ల వికారం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. కావున వ్యాయామానికి దూరంగా ఉండాలి. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌కు కూడా కారణం కావచ్చు.
  2. నిద్రపోకండి: ఆహారం తిన్న వెంటనే నిద్రకు దూరంగా ఉండాలి. మీరు ఆహారం తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు.. కానీ నిద్రపోకూడదు. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా తీవ్రమైన చికాకును కలిగిస్తుంది.
  3. ముందుకు వంగడం నివారించండి: ఆహారం తిన్న తర్వాత ముందుకు వంగడం లాంటివి ఎప్పుడూ చేయకండి. ముందుకు వంగడం వల్ల జీర్ణవ్యవస్థలో పనిచేసే యాసిడ్ దెబ్బతింటుంది.
  4. పండ్లు తినవద్దు: భోజనం చేసిన తర్వాత పండ్లు తినకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం తర్వాత పండ్లు తింటే, ఆహారం పోషకాలను గ్రహించడాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల శరీరానికి అనేక సమస్యలు వస్తాయి.
  5. టీ లేదా కాఫీ తాగవద్దు: టీ లేదా కాఫీలో ఫినాలిక్ సమ్మేళనాలు కనిపిస్తాయి. మీరు భోజనం తర్వాత టీ లేదా కాఫీని తీసుకుంటే పోషకాహారంలో ఉండే ఐరన్ వంటి వాటిని గ్రహించడంలో ఇది అడ్డంకిగా మారుతుంది. ఇది చాలా హానికరం.
  6. మద్యం సేవించవద్దు: ఆహారం తిన్న తర్వాత మద్యం లేదా సిగరెట్లు తాగకూడదు. ఇది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. మీరు భోజనం తర్వాత ఇలా చేస్తే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు తలెత్తుతాయి.
  7. భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం మానుకోండి: ఎప్పుడైనా తిన్న తర్వాత స్నానం చేస్తుంటే.. ముందుగా దానిని నివారించండి. వాస్తవానికి భోజనం చేసిన తర్వాత, జీర్ణక్రియకు సహాయం చేయడానికి రక్తం కడుపుని చుట్టుముడుతుంది. ఇలాంటి సమయంలో స్నానం చేసినప్పుడు, శరీర ఉష్ణోగ్రత మారుతుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.
  8. నీరు తాగకండి: ఆహారం తిన్నప్పుడల్లా ఎక్కువ నీరు తాగకుండా ఉండండి. నీరు జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కడుపులోని ఆమ్లం పలచబడి జీర్ణక్రియ ప్రక్రియను మరింత దిగజార్చుతుంది. కావున తిన్న వెంటనే నీరు తాగడాన్ని మానుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం
ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం